iPhone 16 Price: ఆపిల్ గత సంవత్సరం భారత మార్కెట్‌లో విడుదల చేసిన ఐ ఫోన్ 16 ( iPhone 16) ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో మళ్లీ చర్చలో నిలిచింది. ఈ ఏడాది కొత్త ఐఫోన్ 17 (iPhone 17) గ్లోబల్‌గా లాంచ్ అయిన తర్వాత iPhone 16 ధర సుమారు రూ.10,000 వరకు తగ్గింది. అయితే, సేల్ ఈవెంట్స్‌లో ఇది మరింత తక్కువ ధరకు వస్తోంది. ఇప్పుడు క్రోమా వెబ్‌సైట్‌లో iPhone 16ని భారీ డిస్కౌంట్లతో చాలా తక్కువ ధరకు అందిస్తున్నారు. అంతేకాకుండా, ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌దారులకు అదనంగా ఇన్‌స్టెంట్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి.
ప్రస్తుతం క్రోమాలో ఐ ఫోన్ 16 ( iPhone 16) 128GB వేరియంట్ ధర రూ.66,990గా ఉంది. ఇది అసలు లిస్టింగ్ ధర అయిన రూ.69,900తో పోలిస్తే తక్కువ. అలాగే 256GB వేరియంట్ రూ.76,490, 512GB వేరియంట్ రూ.99,900లకు దొరుకుతున్నాయి. అయితే, IDFC ఫస్ట్ బ్యాంక్, ICICI బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ ఇస్తుండడంతో, iPhone 16 ఎఫెక్టివ్ ధర రూ.62,990కి పడిపోతోంది. అంటే కస్టమర్లు మొత్తం రూ.6,900 వరకు సేవ్ చేయగలరు. ఇదే రూ.4,000 తగ్గింపును 6 నెలలకుపైగా ఉన్న “లో-కోస్ట్ EMI” ఆప్షన్‌లో కూడా ఇస్తున్నారు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, iPhone 17 లాంచ్ తర్వాత ఆపిల్ అధికారికంగా iPhone 16 యొక్క 256GB మరియు 512GB వేరియంట్లు నిలిపివేసింది. అందువల్ల క్రోమాలో లిస్టింగ్‌లో ఉన్న మోడళ్లు స్టాక్‌లో మిగిలిన యూనిట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఆపిల్ iPhone 16 ధరను రూ.79,990 నుంచి రూ.69,990కు తగ్గించిన విషయమూ తెలిసిందే.
iPhone 16 భారతదేశంలో 2024 సెప్టెంబర్‌లో విడుదలైంది. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మెరుగైన సెరామిక్ షీల్డ్, డైనమిక్ ఐలాండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పనితీరుకు ఇది ఆపిల్ 3nm ఆధారిత A18 చిప్‌సెట్ తో వస్తుంది. ఇందులో 6-కోర్ CPU, 5-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. కెమెరాల విషయానికొస్తే 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాతో డ్యుయల్ రియర్ సెటప్ అందించారు.

