Vodafone Idea: వోడాఫోన్ ఐడియా (Vi) తన ప్రీపెయిడ్ సేవల్లో అత్యల్ప ధర వోచర్‌లలో ఒకటైన రూ.1 రీచార్జ్ ప్యాక్‌ను కొనసాగిస్తోంది. నెలలుగా ఎలాంటి మార్పులు లేకుండానే అందుబాటులో ఉన్న ఈ ప్యాక్, అతి తక్కువ వినియోగం చేసే ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉపయోగకరంగా మారుతోంది. ఈ రీచార్జ్‌లో 75 పైసల టాక్‌టైమ్, ఆన్-నెట్ నైట్ నిమిషం, ఒక రోజు చెల్లుబాటు మాత్రమే ఉన్నాయి. ఇందులో అవుట్‌గోయింగ్ SMSలు, డేటా లేదా బండిల్ సేవలు లేవు.
ప్రస్తుతం టెలికాం రంగం అన్‌లిమిటెడ్ ప్లాన్లు, డేటా ప్యాక్స్ OTT బండిల్స్ వైపు దృష్టి సారించినప్పటికీ, కొంతమంది వినియోగదారులు ఇంకా చిన్న మొత్తాల రీచార్జ్‌లను ప్రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కమింగ్ కాల్స్, సాధారణ కమ్యూనికేషన్ లేదా OTP ధృవీకరణ కోసం మాత్రమే సిమ్‌ను వాడే లైట్ యూజర్లు, రెండవ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచే కస్టమర్లు, అత్యవసర సమయంలో చిన్న అవుట్‌గోయింగ్ కాల్ అవసరమయ్యే వారు ఈ రూ.1 రీచార్జ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
రూ.1 ప్యాక్ Vi ప్రీపెయిడ్ టారిఫ్ లో తక్కువ స్థాయి ఆఫర్‌గా నిలుస్తోంది. కంపెనీ ప్రధానంగా అన్‌లిమిటెడ్ హై-వాల్యూ ప్లాన్లపై దృష్టి పెట్టినప్పటికీ, ఈ తరహా ఎంట్రీ-లెవల్ రీచార్జ్‌లను కొనసాగించడం వలన విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చుతోంది.
పరిశ్రమ రిపోర్టుల ప్రకారం, ఓ వర్గం వినియోగదారులు సాధారణంగా నెలవారీ ప్లాన్‌లకు బదులుగా చిన్న మొత్తాల రీచార్జ్‌లను ప్రిఫర్ చేస్తున్నారు. అందువల్ల టెలికాం ఆపరేటర్లు వివిధ రకాల్లో రీచార్జ్ ఎంపికలను కొనసాగిస్తున్నారు.
వోడాఫోన్ ఐడియా ఈ రూ.1 రీచార్జ్ ప్యాక్‌లో ఎటువంటి ప్రధాన మార్పులు చేయలేదు. ప్రస్తుతం కూడా అనేక ఏరియాల్లో అందుబాటులో ఉండి, అతి తక్కువ రీఛార్జ్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది ఉపయోగకరమైన ఎంపికగా నిలుస్తోంది.
