Gadwal District: జోగులాంబ గద్వాలలో ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్
Gadwal District ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Gadwal District: గద్వాల జిల్లా ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్ కలకలం.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత!

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది.ఉదయం టిఫిన్ లో ఉప్మా లో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పురుగులు పడిన ఉప్మా తిన్న తర్వాత హాస్టల్ నుండి పాఠశాల వెళ్లిన విద్యార్థులు ప్రేయర్ చేస్తుండగా కొందరు, క్లాస్ రూమ్ లో మరి కొందరు కళ్ళు తిరిగి కింద పడిపోవటంతో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 17 మంది విద్యార్థులలో 15 మంది విద్యార్థులు సెలైన్ బాటిల్ ఎక్కించి ప్రధమ చికిత్స అందిస్తుండగా మరో ఇద్దరు విద్యార్థులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యురాలు డాక్టర్ హేమలత తెలిపారు.

Also Read: Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు బారెడు.. ఆందోళనలో అభ్యర్థులు

విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

జిల్లాలో ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్య బారిన పడిన సంఘటనలు నెలకొన్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ లో 17 మంది విద్యార్థులు పురుగులు పడిన ఉప్మా తిని అనారోగ్య భారిన పడడంతో హుటాహుటిన సమీపంలోని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. హాస్టల్లో విద్యార్థుల మెనూ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, హాస్టల్ వార్డెన్, వంట మాస్టర్ అప్రమత్తంగా ఉండి ఉప్మా రవ్వను పరిశీలించినట్లయితే ఈ సమస్య తలెత్తేదికాదని అన్నారు.

విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడింది

జిల్లా ఆస్పత్రిలో మీ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. టిఫిన్ లో పురుగులు రావడంతో ప్రత్యామ్నాయంగా బిస్కెట్, అరటిపండు ఇవ్వడంతో కొందరు విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయారని తెలిపారు. అస్వస్థకు గురైన విద్యార్థులను మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత హాస్పిటల్ ను సందర్శించి పరామర్శించారు.

Also Read: Gadwal District: కుక్కలతో జనాలు బెంబేలు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం