Journalists Protest: హైద్రాబాద్‌లో జర్నలిస్టుల మహాధర్నా!
Journalists Protest (imagecredit:swetcha)
మెదక్

Journalists Protest: డిసెంబర్ 3న హైద్రాబాద్‌లో జర్నలిస్టుల మహాధర్నా!

Journalists Protest: గత 12 సంవత్సరాలుగా జర్నలిస్ట్ ల సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈనెల 3న హైదరాబాద్(Hyderabad) లోని మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం వద్ద టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు ఎ.శంకర్ దయాల్ చారి తెలిపారు. ఈ మహా ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కరపత్రాలు ఆవిష్కరణ

రాష్ట్ర వ్యాప్తంగా పుష్కర కాలంగా జర్నలిస్ట్(Journalist)లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. తాము అధికారంలోకి రాగానే జర్నలిస్ట్ ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలైనా కేవలం మాటలతో కాలం గడుపుతూ జర్నలిస్టుల సమస్యలును పట్టించుకోవడం లేదన్నారు. జర్నలిస్టుల సమస్యలైన అక్రిడిటేషన్ కార్డుల మంజూరు, హెల్త్ కార్డుల(Health Cards) అమలు, ఇంటి స్థలాలు కేటాయింపు సాధించుకొనేందుకు ఈ మహాధర్నాకు జిల్లా నుండి అధిక సంఖ్యలో జర్నలిస్ట్ లు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

Alson Read: Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!

కమిటీ సభ్యులు

ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమ కమిటీ సభ్యులు కంది. శ్రీనివాస్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కామాటి కృష్ణ, జిల్లా నాయకులు రాజశేఖర్, ఖయ్యుం, సందీప్, లక్ష్మినారాయణ, శ్రీనివాస్, నర్సింహాచారి, శ్రీనివాస్ చారి, మురళీధర్, ప్రకాష్, రమేష్, శేఖర్, రాజగౌడ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Samantha Wedding: దర్శకుడు రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్న సమంత రూత్ ప్రభు!.. ఎక్కడంటే?

Just In

01

Jangaon Municipality: జ‌న‌గామ మున్సిపల్ క‌మిష‌నరా మ‌జాకా.. పార పట్టి మట్టి ఎత్తిన పెద్దసారు..!

Jewelry Theft Case: జువెలరీ చోరీ కేసు చేధించిన పోలీసులు.. బయటపడిన నిజాలు ఇవే

Huzurabad Area Hospital: ఏరియా హాస్పిటల్‌లో ఓ రేడియాలజిస్ట్ చేతిలో బందీ అయిన స్కానింగ్ సెంటర్!

Ustaad Bhagat Singh: ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. సర్‌ప్రైజ్ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

GHMC merger: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియలో కీలక పరిణామం