Potatoes: బంగాళదుంపలు ఇష్టమని అతిగా లాగిస్తున్నారా?
Potatoes ( Image Source: Twitter)
లైఫ్ స్టైల్

Potatoes: బంగాళదుంపలు ఇష్టమని అతిగా లాగిస్తున్నారా.. అయితే, డేంజర్లో ప‌డ్డట్టే?

Potatoes: “ఆరోగ్యం మహాభాగ్యం” అని మన పెద్ద వాళ్ళు కూడా చెబుతుంటారు. కానీ, ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపించడం లేదు. ముఖ్యంగా, ఆహారపు అలవాట్ల విషయంలో మితముగా ఆలోచించడం చాలా అరుదుగా మారింది. బంగాళదుంపలను ఎక్కువగా తింటే శక్తి పెరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ వైద్య నిపుణుల ప్రకారం, వీటిని మితంగా మాత్రమే తీసుకోవడం మంచిది. అధికంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు అని వైద్యులు తెలిపారు.

Also Read: Collector Rahul Raj: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార నిబంధనలు.. పోటీ చేసే అభ్యర్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ మార్గదర్శకాలు!

బంగాళదుంపలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ముఖ్యంగా ఆలు చిప్స్, ఫ్రైడ్ వేరియంట్లు ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. కొవ్వు శాతం పెరగడం, అధిక చక్కర స్థాయిలు, రక్తపోటు (BP) సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా.. వాతాన్ని పెంచే స్వభావం కారణంగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు వేధిస్తాయి.

Also Read: Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

డయాబెటిస్ ఉన్నవారికి బంగాళదుంపలు పూర్తిగా నివారించడమే మంచిది. అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా చక్కర స్థాయిలు వేగంగా పెరుగుతూ, షుగర్ రక్తంలో ప్రమాదకర స్థాయికి చేరుతుంది. కాబట్టి, ఏ ఆహారం అయినా మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్యులు సూచించినట్లుగా, బంగాళదుంపలను రోజువారీ పరిమాణంలో మాత్రమే తీసుకోవడం, శక్తినిస్తూ కూడా ఆరోగ్యాన్ని కాపాడే మార్గం. మొత్తం బంగాళదుంపలు మితంగా తింటే శక్తి పెంచుతాయి. మితిమీరిన వాడకంలో అయితే ఆరోగ్యానికి హానికరం అవుతుంది. ఆహారంపై సరైన నియంత్రణ, వ్యాయామం, డైట్ అనేవి ఆరోగ్యం కోసం కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?