Delhi Hospital: ఆస్పత్రిలో అమానుషం.. శవంపై నగలు మాయం!
Delhi Hospital (Image Source: Twitter)
Viral News

Delhi Hospital: ఆస్పత్రిలో అమానుషం.. చనిపోయిన పేషెంట్ నగలు మాయం.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

Delhi Hospital: దిల్లీలోని కృష్ణానగర్ లో గోయల్ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వృద్ధ మహిళ ఒంటిపై ఉన్న నగలు మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోయల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగడం.. మరింత వివాదానికి దారితీసింది. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతున్న క్రమంలోనే షాకింగ్ వీడియో బయటకొచ్చింది.

అసలేం జరిగిందంటే?

నవంబర్ 11 ఉదయం 5 గంటల సమయంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న మహిళను గోయల్ హాస్పిటల్‌కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో  ఎమర్జెన్సీ వార్డులో ఆమెను చేర్పించారు. ఆ సమయంలో వద్ధురాలి ఒంటిపై చెవిపోగు, ఉంగరాలు, చైన్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఆమె పరిస్థితి మరింత క్రిటికల్ గా మారడంతో నగరంలోని జీటీబీ ఆస్పత్రికి వృద్ధురాలిని రిఫర్ చేశారు. ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలోనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.

‘ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’

వృద్ధురాలిని మరో ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బంగారు వస్తువుల గురించి ఎలాంటి సమాచారాన్ని గోయల్ ఆస్పత్రి సిబ్బంది ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆభరణాలు ఏవని ప్రశ్నించగా.. ఆస్పత్రి సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుపై ఫిర్యాదు చేసినా స్థానిక ఎమ్మెల్యే ఆస్పత్రి కావడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు.

Also Read: Strange Incident: పానిపూరి తింటూ.. దవడ విరగొట్టుకున్న మహిళ.. వామ్మో ఇదేం విచిత్రం!

సీసీటీవీ వీడియో.. ఎమ్మెల్యే స్పందన

ఆభరణాలు ఎప్పుడు, ఎలా మాయమయ్యాయో తెలుసుకునేందుకు ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని మృతురాలి కుటుంబ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వృద్ధురాలి ఒంటిపైన నగలను ఆస్పత్రి సిబ్బంది దోచుకుంటున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. అందులో ఆమె ఆభరణాలు తీయడం స్పష్టం కనిపించింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు తన ఆస్పత్రిపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే డా. అనిల్ గోయల్ స్పందించారు. ఇది పోలీసుల పరిధిలోని విషయమన్న ఆయన.. చట్టప్రకారం వారు చేయాల్సింది చేస్తారని పేర్కొన్నారు.

Also Read: Bigg Boss Telugu 9: తనూజ, ఇమ్ము ఏడిపించారు కదయ్యా.. జోక్ అంటారేంటి? ఫైరింగ్ నామినేషన్స్

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!