Strange Incident: పానిపూరి తింటూ.. దవడ విరగొట్టుకున్న మహిళ
Strange Incident (Image Source: Twitter and AI)
Viral News

Strange Incident: పానిపూరి తింటూ.. దవడ విరగొట్టుకున్న మహిళ.. వామ్మో ఇదేం విచిత్రం!

Strange Incident: స్ట్రీట్ ఫుడ్ లో పానిపూరీకి ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో ఇష్టంగా వాటిని తింటుంటారు. ముఖ్యంగా మహిళలు.. పానిపూరిని ఎంతగానో ఇష్టపడుతుంటారు. అలాంటి పానిపూరీని తింటూ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకొంది. పానిపూరి తింటున్న క్రమంలో ఆమె దవడ విరిగిపోయి.. ఆస్పత్రి  పాలైంది. ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరైయా జిల్లా (Auraiya district)లో శనివారం (నవంబర్ 29) రోజున ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పానిపూరి (గోల్గప్పా) తినడానికి నోరు పెద్దగా తెరవడంతో 42 ఏళ్ల మహిళ దవడ విరిగిపోయింది. గౌరి కిషన్ పూర్ గ్రామానికి చెందిన ఇంకలా దేవి (Inkala Devi)కి ఈ ఛేదు అనుభవం ఎదురైంది. పానిపూరి తినడం కోసం తెరిచిన నోటిని దవడ విరిగిపోవడం వల్ల తిరిగి ఆమె మూయలేకపోయింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు.. ఆమెను హుటాహుటీనా వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించారు.

బంధువు ఏం చెప్పారంటే?

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంకలాదేవి ఓ పానిపూరి బండి వద్దకు వెళ్లింది. పానిపూరి తినేందుకు నోరు తెరవడంతో ఆమె దవడ స్థానభ్రంశం (Dislocating Jaw) అయినట్లు పేర్కొన్నారు. ‘పానిపూరి తినడానికి తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది. మెుదట సాధారణ నొప్పి అనుకున్నాం. కానీ నోరు మూతపడకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం’ అని బాధితురాలి మేనకోడలు సావిత్రి తెలిపింది.

దవడ ఎలా విరిగిందంటే?

బాధిత మహిళను తొలుత డిస్ట్రిక్ట్ జాయింట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు మనోజ్ కుమార్, శత్రుఘ్న సింగ్ ఆమె దవడను సరిచేసేందుకు యత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో చిచోలి మెడికల్ కాలేజీకి ఆమెను తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ శత్రుఘ్న సింగ్ మాట్లాడుతూ.. నోరు మరీ ఎక్కువగా తెరవడం వల్ల దవడ డిస్‌లోకేట్ అయ్యి ఉండొచ్చని పేర్కొన్నారు.

Also Read: CM Revanth Reddy: వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.151 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

‘వైద్యులను సంప్రదించండి’

సాధారంగా ఇలాంటి ఘటనలు మాంసాహారం తింటున్న సమయంలో చూస్తుంటామని డాక్టర్ మనోజ్ తెలిపారు. దవడ నొప్పి ఉన్నవారు లేదా నోరు పెద్దగా తెరవలేకపోతున్నవారు.. బలవంతంగా నోరు తెరిస్తే ఇలాంటి ప్రమాదమే జరగవచ్చని హెచ్చరించారు. దవడ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా దంత వైద్యుడు లేదా నిపుణుడిని సంప్రదించాలని సూచించారు. మెడికల్ వైద్యాధికారులు ఆమె దవడను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని డా. మనోజ్ స్పష్టం చేశారు.

Also Read: Shocking Video: 20 అడుగుల గోడ దూకి.. సింహాల బోనులోకి వెళ్లాడు.. తర్వాత ఏమైదంటే?

Just In

01

Gogoi on Modi: పార్లమెంట్‌ను మోదీ హైజాక్ చేశారు.. కాంగ్రెస్ ఎంపీ షాకింగ్ కామెంట్స్

AP Viral Infection: ఏపీలో కొత్త వ్యాధి కలకలం.. పురుగు నుంచి పుట్టుకొచ్చిన మహమ్మారి..?

Bigg Boss Telugu 9: తనూజ, ఇమ్ము ఏడిపించారు కదయ్యా.. జోక్ అంటారేంటి? ఫైరింగ్ నామినేషన్స్

WhatsApp: వాట్సప్, మెసేజింగ్ యాప్‌లకు DoT షాక్.. 6 గంటల తర్వాత లాగ్ అవుట్ చేయాల్సిందే!

Strange Incident: పానిపూరి తింటూ.. దవడ విరగొట్టుకున్న మహిళ.. వామ్మో ఇదేం విచిత్రం!