Gogoi on Modi: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) ప్రారంభమైన తొలి రోజునే రాజకీయ వ్యాఖ్యలు కాకరాజేస్తున్నాయి. పాలక పక్షం టార్గెట్‌గా విపక్ష సభ్యులు… ప్రతిపక్ష పార్టీలు లక్ష్యంగా బీజేపీ నేతలు పరస్పరం పదునైన విమర్శలు చేసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ను (Gogoi on Modi) హైజాక్ చేశారని అన్నారు. రాజకీయ పార్టీలు లేవనెత్తే ప్రధానమైన సమస్యలకు జవాబుదారీగా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధంగా లేరని విమర్శించారు.
ఈ మేరకు సోమవారం గౌరవ్ గొగోయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఫ్లోర్ లీడర్ల సమావేశంలో భారత ఎన్నికల వ్యవస్థ గురించి చర్చించాలని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కోరాయని, అయినా ఈ వారం పార్లమెంటు ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చడానికి బీజేపీ చాలా తేలికగా నిరాకరిస్తోందని మండిపడ్డారు. పాలకపక్షం, ప్రతిపక్షం రెండింటి అజెండా పార్లమెంటులో ప్రతిబింబించాలని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.
Read Also- Modi vs Priyanka: ప్రధాని మోదీ వర్సెస్ ప్రియాంక గాంధీ.. మాటల తూటాలు.. మోదీ ఏమన్నారో తెలుసా?
విపక్షాల అజెండాపై చర్చ ఏది?
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు కూడా గౌరవ్ గొగోయ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిల్లులను ఆమోదించే విషయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, కానీ, ప్రజా సమస్యలను లేవనెత్తవద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సమస్యలను లేవనెత్తుతామంటే ప్రభుత్వానికి నచ్చడం లేదని ఆయన మండిపడ్డారు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, విపక్ష పార్టీలన్నీ బిల్లుల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటున్నాయని అన్నారు. తాము చేస్తున్న ఒకే ఒక్క విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వం తీసుకురాబోతున్న అన్ని బిల్లులకు సహకరిస్తాం కాబట్టి, ప్రజా సమస్యలపై గొంతు విప్పే అవకాశం కూడా కల్పించాలని ఆయన కోరారు.
ప్రతిపక్షాల అజెండాలోని అంశాలపై చర్చ జరిపేందుకు కూడా ప్రభుత్వ సహకరించాలని సూచించారు. కానీ, ప్రభుత్వం కేవలం బిల్లులు పాస్ చేసుకునేందుకు మాత్రమే ఆసక్తిచూపుతోందని, అంతకుమించి విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ పనితీరు ఇలా ఉండదని గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు.
Read Also- Renuka Chowdhury: కుక్కతో పార్లమెంటుకు వచ్చిన ఎంపీ రేణుకా చౌదరి.. షాకింగ్ కామెంట్స్‌తో దుమారం!
ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలను కూడా చర్చించాలని ప్రభుత్వం భావిస్తే, అజెండాలో పెట్టాలని గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. చెప్పిన విషయానికి కట్టుబడరని, ఇదేవారితో వచ్చిన సమస్య అని విమర్శించారు. ఓటర్ల జాబితాలోని తప్పులపై చర్చ జరిపేందుకు వాయిదా తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టానని ఆయన చెప్పారు. దేశానికి ముప్పుగా మారిన ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
Prime Minister Modi has hijacked the Parliament of India. The Prime Minister does not want to be held accountable to any of the major issues raised by the political parties. In the meeting of floor leaders, all political parties belonging to the opposition wanted to discuss the…
— Gaurav Gogoi (@GauravGogoiAsm) December 1, 2025
