HYDRAA: కూకట్‌పల్లి నల్లచెరువు లోని ఆక్రమణలను హైడ్రా(Hydraa) తొలగించలేదని హైడ్రా గురువారం స్పష్టం చేసింది. చెరువు ఫుల్ ట్యాంక్ పరిధిలోకి వచ్చిన సర్వే నంబరు 176లో ఉన్న తాత్కాలిక షెడ్డులను హైడ్రా ఇప్పటికే ఖాళీ చేయించింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించిన ఆటోవాలాలు, స్క్రాప్‌ను వేరు చేసి అమ్ముకునేవారు తాత్కాలికంగా ప్లాస్టిక్ కవర్లతో వేసిన షెడ్డులను ఇప్పటికే తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది.
స్వచ్ఛందంగా ఖాళీ
ఖాళీ చేయాలని వారిని హైడ్రా కోరగానే సమ్మతించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు హైడ్రా పేర్కొంది. చెత్తను సేకరించినవారితో పాటు స్క్రాప్ అమ్ముకునే వారి నుంచి అద్దెలు కూడా తీసుకుని, వారిని అడ్డం పెట్టుకుని ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించింది. సర్వే నంబరు 180 లో ఇప్పుడు అక్కడ పేదల గుడిసెలు అని హైడ్రామా సృష్టిస్తున్నారు. అక్కడ తాత్కాలిక షెడ్డులు వేసుకున్న వారు స్వయంగా ఖాళీ చేసుకుని వెళ్లిపోగా, కొంతమందితో కలిసి కబ్జాదారులు చివరి ప్రయత్నం చేస్తున్నారు. 180 సర్వే నెంబరులోని ఆక్రమణదారుల్లో కొందరు నష్టపరిహారం కావాలని హైకోర్టు(High Cort)ను ఆశ్రయించినట్లు హైడ్రా వెల్లడించింది.
Also Read: MLC Kavitha: ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ.. కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
కోర్టు దృష్టికి హైడ్రా
హైడ్రా ఖాళీ చేయిస్తున్నది 176 సర్వే నంబరులో అని కోర్టుకు వివరించినట్లు హైడ్రా పేర్కొంది. అలాగే చెత్తను చెరువు పరిధిలోకి తీసుకువచ్చి, జలాలను కాలుష్యం చేస్తున్న విషయం కూడా కోర్టు దృష్టికి హైడ్రా తీసుకెళ్లినట్లు హైడ్రా వివరించింది. సర్వే నంబరు సరి చూసుకుని వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాలని హైకోర్టు సూచించడంతోనే రెండు మూడు రోజుల క్రితం అక్కడ చెత్తను సేకరించేవారు స్వయంగా ఖాళీ చేసి వెళ్లి పోయారు. వారి బదులు అక్కడ స్థలాన్ని కబ్జా చేసేందుకు కబ్జాదారుల ప్రయత్నం ఈ గందరగోళమని హైడ్రా గురువారం క్లారిటీ ఇచ్చింది.
Also Read: Anaganaga Oka Raju: ‘భీమవరం బల్మా’ సాంగ్ వచ్చేసింది.. ‘బల్మా’ అంటే ఏంటో తెలుసా?

