V.C. Sajjanar: నిఘా నేత్రాలకు నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలు
V.C. Sajjanar (imagecredit:twitter)
హైదరాబాద్

V.C. Sajjanar: పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. నిఘా నేత్రాలకు నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలు

V.C. Sajjanar: మూడో కన్ను ఇక మూసుకోదు. దీని కోసం హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ లో ఎంపవరింగ్​ యువర్​ ఎవ్రీడే సేఫ్టీ (ఐస్​) బృందాలను రంగంలోకి దింపారు. అడ్వాన్స్ డ్​ సిటీ సర్విలెన్స్ గ్రిడ్​ మేనేజ్ మెంట్​ ప్రొటోకాల్ ప్రాజెక్టు(Advanced City Surveillance Grid Management Protocol Project)లో భాగంగా దీనికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బంజారాహిల్స్ లోని ఐసీసీసీ ఆడిటోరియంలో కమిషనర్ వీ.సీ.సజ్జనార్​(V.C. Sajjanar) ఈ బృందాలను ప్రారంభించారు. ఉన్నతాధికారులతో కలిసి లోగోను ఆవిష్కరించటంతోపాటు రిపేర్​ కిట్లను ఆయా బృందాలకు అందచేశారు. వీరి కోసం ప్రత్యేకంగా తెప్పించిన నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

సాంకేతిక సమస్యలతో..

ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad) కమిషనరేట్​ పరిధిలో లక్షా 60వేలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే, సాంకేతిక సమస్యలతో వీటిలో ప్రతీరోజూ 3‌‌0శాతం కెమెరాలు పని చేయటం లేదు. ఆయా కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుండటంతోపాటు ట్రాఫిక్​ నియంత్రణ ఉపయోగపడుతున్న సీసీ కెమెరాల్లో కొన్ని పని చేయక పోతుండటం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి పరిష్కారానికే ప్రత్యేక బృందాలను కమిషనర్ సజ్జనార్ రంగంలోకి దింపారు. ఇక, కెమెరాల నిర్వహణ కోసం కెమెరా సపోర్ట్​ కాల్ సెంటర్​ ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా కెమెరా పని చేయటం లేదంటే ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగి వాటిని రిపేర్​ చేస్తాయి.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ నుంచి బదిలీ కోసం అధికారుల ప్రయత్నాలు.. కారణం అదేనా..!

క్రిస్టియన్​ లీడర్స్​ ఫోరం

దాంతోపాటు దర్యాప్తు అధికారులకు కావాల్సిన వీడియో(Video) ఫుటేజీలను అందిస్తాయి. ప్రతీ జోన్​ లో రెండు సీసీటీవీ టెక్నీషియన్​ బృందాలు పని చేస్తాయి. ఫిర్యాదు అందిన వెంటనే పని చేయని కెమెరాలను మరమ్మత్తు చేస్తాయి. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్​ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణ నగర భద్రతలో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఇక, క్రిస్టియన్​ లీడర్స్​ ఫోరం ఇచ్చిన 4 లక్షల రూపాయల చెక్కును సెంట్రల్ జోన్​ డీసీపీ శిల్పవల్లి కమిషనర్ కు అందచేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్​ (క్రైమ్స్​) శ్రీనివాస్​ తోపాటు అన్ని జోన్లు, స్పెషల్ బ్రాంచ్, హెడ్​ క్వార్టర్స్​ డీసీపీలు, అన్ని పోలీస్​ స్టేషన్ల సీఐలు, డివిజన్ల ఏసీపీలు పాల్గొన్నారు.

Also Read: Congress 2014 defeat: కాంగ్రెస్ ఓటమికి సీఐఏ, మొస్సాద్ కుట్ర.. కాంగ్రెస్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!