Director Clarity on Indian's Movie Comments
Cinema

Bharatiyudu 2: భారతీయుడి మూవీ కామెంట్స్‌పై డైరెక్టర్‌ క్లారిటీ

Director Clarity on Indian’s Movie Comments: సెన్సేషనల్‌ డైరెక్టర్ శంక‌ర్ దర్శకత్వంలో భార‌తీయుడు 2 మూవీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ ట్రైల‌ర్ ఇటీవలే రిలీజ్ కాగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ట్రైల‌ర్‌లో విజువ‌ల్స్ వావ్ అనిపిస్తున్నాయి. దీంతో ఈ మూవీ ట్రైలర్‌ ఆడియెన్స్‌ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇంకో హైలైట్‌ ఏంటంటే లోకనాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.దీంతో క‌మ‌ల్ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

అయితే కొంత‌మంది మాత్రం శంక‌ర్ ఈ సేనాప‌తి క్యారెక్ట‌ర్‌ని ఇలా మ‌లిచాడేంటని షాక్ అవుతూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే భార‌తీయుడు 2లో సేనాప‌తి వ‌య‌సు 74 ఏళ్లుగా చూపించారు. దాంతో పోల్చుకుంటే భారతీయుడి వయసు 102 ఏళ్లుండాలి. అంత‌టి ముస‌లి క‌మ‌ల్, ష‌ర్టు విప్పి సిక్స్ ప్యాక్ చేయ‌డం, మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ప్ర‌దర్శించడం, గాల్లో దూకుతూ ఫీట్లు చేయ‌డం ఇవ‌న్నీ కృత్రిమంగా అనిపించాయి. పైగా భార‌తీయుడు 2లో సేనాప‌తి ఇంకా యంగ్‌గా క‌నిపించాడంటూ రకరకాల కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై డైరెక్టర్ శంక‌ర్ రియాక్ట్‌ అయ్యాడు. భార‌తీయుడు టైంలో క‌మ‌ల్ వ‌య‌సు ప్ర‌స్తావించిన సంగ‌తి త‌న‌కు గుర్తులేద‌ని, అందుకే ఆ దిశ‌గా ఆలోచించ‌లేక‌పోయాయ‌ని చెప్పాడు.

Also Read: కల్కి గుడి నెట్టింట వైరల్

ఆ రోల్‌కి సూప‌ర్ హీరోలానే చూడాల‌ని, చైనాలో వందేళ్ల‌కు పైబ‌డిన మార్ష‌ల్ ఆర్ట్స్ గురువులు ఉన్నార‌ని, వాళ్లు అంద‌రికంటే చ‌లాకీగా ఉంటార‌ని, ఆ స్ఫూర్తితోనే భార‌తీయుడు 2 స్టోరీని రాసుకున్నాన‌ని క్లారిటీ ఇచ్చాడు. భార‌తీయుడు 2 తీస్తున్న‌ప్పుడు పార్ట్ 2 గురించి ఆలోచించలేద‌ని, అలా ఆలోచించి ఉంటే సేనాప‌తి వ‌య‌సుని ప్ర‌స్తావించేవాడినే కాద‌ని శంక‌ర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్టోరీ పార్ట్ 2కే ప‌రిమితం కావ‌డం లేదు. పార్ట్ 3 కూడా వ‌స్తోంది. సిద్దార్థ్ ఈ మూవీలో కీల‌క రోల్‌ చేస్తున్నాడు. ఎస్‌.జె.సూర్య విలన్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ జులై 12న భార‌తీయుడు 2 పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కానుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!