GHMC Property Tax: ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్.. వసూళ్లను
GHMC Property Tax ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

GHMC Property Tax: ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్.. వసూళ్లను వేగవంతం చేసేందుకు బల్దియా కొత్త ప్రయోగం!

GHMC Property Tax:  పీకలదాక అప్పుల్లో కూరుకుపోయిన రొటీన్ మెయింటనెన్స్ కూడా గగనంగా మారిన జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ను వీలైనంత ఎక్కువగా వసూలు చేసుకోవాలని భావిస్తుంది. స్టాఫ్ ప్రమేయం లేకుండా, మ్యానువల్ నోటీసుల్లేకుండా, పెంచిన పన్నుకు సంబంధించి ఓనర్ కు ఎలాంటి సందేహాలు రాకుండా ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. ముఖ్యంగా కరెంటు, వాటర్ బిల్లులతో పాటు ఆదాయ పన్ను చెల్లించటంలో చూపే ఆసక్తి, శ్రద్ధను గ్రేటర్ హైదరాబాద్ వాసులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించటంలో చూపటం లేదన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అ ధికారులు ఆర్టీపీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి ట్యాక్స్ సిబ్బంది ప్రమేయం లేకుండానే, నేరుగా ప్రాపర్టీ ఓనర్ ఆన్ లైన్ లో చెల్లించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

వంద కోట్లు అధికంగా కలెక్షన్

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 15.50 లక్షల ఆస్తులకు చెందిన యజమానులు ప్రాపర్టీ ట్యాక్స్ చెలిస్తుండగా, వీటిలో రెండు లక్షల వరకు కమర్షియల్ ప్రాపర్టీలున్నట్లు జీహెచ్ఎంసీ వద్దనున్న రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు అమలు చేస్తున్న బెంచ్ మార్క్ ప్రాపర్టీ ట్యాక్స్ విధానం కింద దశాబ్దాల కాలం నుంచి పైసా పన్ను పెంచకుండా జీహెచ్ఎంసీ ట్యాక్స్ స్టాఫ్ తో పన్ను కలెక్షన్ చేసుకుంటుంది. ఏటా రూ. వంద కోట్ల నుంచి రూ. 150 కోట్ల పెంచుకుంటూ గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో రూ. 2038 కోట్ల రికార్డు స్థాయి కలెక్షన్ చేసుకుంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు సుమారు రూ. 1430 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే తేదీ వరకు అయిన ట్యాక్స్ కలెక్షన్ తో పోల్చితే రూ. వంద కోట్లు అధికంగా కలెక్షన్ చేశారు.

ఏఐ వినియోగం ఇలా

ప్రస్తుతం ఆన్ లైన్ లో జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలు అందుబాటులో ఉన్నా, వాటిని చెక్ చేసుకుని పన్ను చెల్లించే యజమానులు అంతంతమ్రాతంగానే ఉన్నారు. దశాబ్దాల క్రితం నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ పైసా పెంచలేదు. ఉన్న ప్రాపర్టీలు కనీసం యూసేజీకి తగిన విధంగా పన్ను చెల్లిస్తున్నాయా? లేదా?, ప్రస్తుతం ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయి? తీసుకున్న అనుమతులను ఉల్లంఘించి అదనంగా అంతస్తులేమైనా వచ్చాయా? వినియోగం రెసిడెన్షియలా? కమర్షియలా? అన్న విషయాలను ఫీల్డు లెవెల్ లో టెక్నికల్ గా తెల్సుకునేందుకు గత సంవత్సం జూలై మాసం నుంచి అధికారులు సిటీలోని ప్రాపర్టీలపై జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే( జీఐఎస్ )ను నిర్వహిస్తున్నారు.

Also ReadGHMC Property tax: దారి మళ్లుతున్న బల్దియా నిధులు.. ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల చేతివాటం!

జీఐఎస్ సర్వే లో సేకరించిన డేటా బేస్

ఇప్పటి వరకు సుమారు 12 లక్షల ఆస్తులపై ఈ సర్వే ముగిసిన, ఇపుడు తుది దశలో ఉంది. ఈ సర్వేలో సేకరించిన సమాచానాన్ని విజువల్స్ తో యజమానికి అందుబాటులో ఉంచి, ఆదాయ పన్ను మాదిరిగానే ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేలా రిమైండర్లు ఇచ్చేలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించనున్నారు. యజమానికి తన ఆస్తికి సంబంధించిన వివరాలు, విజువల్స్ తో పాటు చెల్లించాల్సిన పన్ను, తేదీలకు సంబంధించి అలర్ట్ లు ఇచ్చేలా ఈ ఏఐను వినియోగించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం తుది దశలోనున్న జీఐఎస్ సర్వే లో సేకరించిన డేటా బేస్ మొత్తాన్ని ఏఐకి లింక్ చేయనున్నట్లు తెలిసింది. ప్రాపర్టీలో అదనపు అంతస్తులు వచ్చినా, యూసేజీ మారినా, రెసిడెన్షియల్ ప్రాపర్టీకి కమర్షియల్ కరెంట్ మీటర్లు వినియోగించినా, ఆ విజువల్స్ అన్ని యజమానికి అందుబాటులోకి వచ్చి, పెరిగిన ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించి ఎలాంటి అనుమనాల్లేకుండా ఆధారాలతో అందుబాటులోకి తెచ్చే దిశగా జీహెచ్ఎంసీ కసరత్తు కొనసాగుతుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి…

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) నకు సంబంధించి రూ. 2500 కోట్ల వసూళ్లను భారీ టార్గెట్ గా పెట్టుకున్న అధికారులు ఇంకా మిగిలి ఉన్న కేవలం మూడున్నర నెలల్లో టార్గెట్ కు తగిన విధంగా రూ. వెయ్యి 70 కోట్లను వీలైనంత ఎక్కువ వేగంగా వసూలు చేసుకోవాలని భావిస్తుంది. ఇందుకు గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. కానీ ఇప్పటికే తుది దశలో ఉన్న జీఐఎస్ సర్వే ముగిసేందుకు ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నందున, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసే సరికొత్త విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం 2026 ఏప్రిల్ తర్వాతే అందుబాటులోకి వచ్చే అవకాశాలెక్కువగా కన్పిస్తున్నాయి.

Also ReadGHMC Property Tax Scam: ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాని 70 వేల భవనాలు.. జీఐఎస్ సర్వేతో బయటపడ్డ అక్రమాలు

Just In

01

Realme Narzo 90: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మీ నార్జో 90

CM Revanth Reddy: యంగ్ ఇండియా స్కూల్స్.. రూ.30 వేల కోట్ల వ్య‌యం.. కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం కీలక భేటి

Rowdy Janardhan: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. టీజర్ ఎప్పుడంటే?

Hyderabad Crime: పహాడీషరీఫ్‌లో మైనర్‌పై అత్యాచారం.. బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి!

India Mexico Trade: టారిఫ్ పెంపులకు కౌంటర్‌గా మెక్సికోతో పరిమిత వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అడుగులు