Ayodhya:
Ayodhya ( Image Source: Twitter)
జాతీయం

Ayodhya: 100 టన్నుల పూలతో ముస్తాబైన అయోధ్య.. మంగళవారం రామ మందిరంలో జెండా ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

Ayodhya: అయోధ్యలో ఈ నెల 25న జరగనున్న శ్రీ రామ్ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ మహోత్సవం కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. పవిత్ర క్షణానికి ముందుగానే నగరం మొత్తం పూలతో నిండిపోతోంది. సుమారు 100 టన్నుల పూలతో ఆలయ ప్రాంగణం నుంచి నగరంలోని ప్రధాన మార్గాల వరకూ భారీ అలంకరణలు చేపట్టారు. దీని వల్ల అయోధ్య మొత్తం పసుపు, ఎరుపు, తెలుపు రంగుల పూలతో కళకళలాడుతోంది.

ఆలయ పురోహితులు మీడియాతో మాట్లాడుతూ.. “ ధర్మ ధ్వజ్ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈసారి పూల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పూలు భగవాన్ రామునికి ఎంతో ప్రీతికరమైనవి. వినాయకుడు, భగవాన్ రాముని అభిష్టంగా మారిగోల్డ్ పువ్వులతో అలంకరణ ప్రారంభించాం. మొత్తం 100 టన్నుల పూలను ఆలయం, నగరాన్ని అలంకరించేందుకు వినియోగించాం.. ” అని తెలిపారు.

Also Read: Shiva Jyothi Controversy: తిరుమలలో చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన యాంకర్ శివ జ్యోతి..

అలంకరణ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు ఈ చారిత్రక ఘట్టంలో భాగమవ్వడం తమ అదృష్టమని చెబుతున్నారు. మీడియాతో మాట్లాడిన ఒక కార్మికుడు, “ రామ్ మందిరం నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ధ్వజారోహణ మహోత్సవం సమయం వచ్చింది. ప్రధాని మోదీ 25న వస్తున్నారు. అనేక రకాల పూలతో అలంకరణ కొనసాగుతోంది. సన్యాసులందరి నుంచి పూర్తి సహకారం అందుతోంది” అని అన్నారు. మరొకరు మాట్లాడుతూ, “ భగవాన్ రాముని దర్శించుకోవడం మా అదృష్టం. మేము మూడు రోజుల క్రితం నుంచి రాత్రింబవళ్లు పని చేస్తున్నాం. ఇప్పుడు ఆలయం అద్భుతంగా ముస్తాబైంది.” అని తెలిపారు.

Also Read: India Warns to Pakistan: పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చిన భారత్.. మరో దాడికి ప్రయత్నిస్తే సిందూర్‌ కంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది

స్థానిక వ్యాపారాలపై ధ్వజారోహణ ప్రభావం

ప్రధాని మోదీ చేపట్టనున్న ఈ చారిత్రాత్మక ధ్వజారోహణ కార్యక్రమం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అతిథి సేవలు, రవాణా, స్థానిక కళలు, హస్తకళలు, ప్రత్యేకించి బెల్లం వంటి వస్తువులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ పర్యాటక రద్దీతో కోట్లు రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నవంబర్ 25న జరిగే ఈ ధ్వజారోహణ కార్యక్రమం ద్వారా శ్రీ రామ్ జన్మభూమి ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంలో అయోధ్యకు సంబంధించిన ప్రాచీన పతాకాన్ని తిరిగి వెలికితీసిన ఇండాలజిస్ట్ లలిత్ మిశ్రా పరిశోధన ప్రాధాన్యంగా నిలిచింది.

Also Read: CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు !

ఈసారి ఎగరవేయబోయే ధ్వజంపై మూడు ముఖ్యమైన చిహ్నాలు ఉంటాయి. ఓం, సూర్యుడు, కోవిదార వృక్షం. కోవిదార వృక్షం అనేది మాండార్, పారిజాత వృక్షాల మిశ్రమంగా ఋషి కశ్యపుడు సృష్టించిన హైబ్రిడ్ చెట్టు అని శాస్త్రగ్రంథాల్లో తెలుస్తుంది. సూర్యచిహ్నం భగవాన్ రాముని సూర్యవంశ పరంపరను సూచిస్తుంది. ఓం శాశ్వత శబ్దాన్ని ప్రతిబింబిస్తుంది. కార్యక్రమానికి ముందు అయోధ్యలో భారీ స్థాయిలో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టి భక్తులు, సందర్శకులను ఆహ్వానించేందుకు నగరం సిద్ధమవుతోంది.

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!