Samsung Galaxy S25 5G: బ్లాక్ ఫ్రైడే సీజన్ మొదలైన వెంటనే ఆన్‌లైన్ మార్కెట్‌ల్లో ఆఫర్ల హడావుడి మొదలైంది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ కూడా తన తాజా ఫ్లాగ్‌షిప్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 5 జీ ( Samsung Galaxy S25 5G) పై భారీ ధర తగ్గింపును ప్రకటించి టెక్ లవర్స్‌కు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. అసలు ధర రూ. 80,999 ఉన్న ఈ ఫోన్, ఎన్నో లేయర్డ్ ఆఫర్లతో కలిసి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతంగా రూ. 43,509 వరకు తగ్గిపోవడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న రూ. 11,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 2,095 కార్డ్ డిస్కౌంట్, బై మోర్ – సేవ్ మోర్ కింద రూ.6,000 వరకు అదనపు తగ్గింపు ఈ డీల్‌ను మరింత విలువైనదిగా మార్చాయి. అంతేకాదు, వినియోగదారు పాత ఫోన్ విలువ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా పాత Galaxy S23 వంటి మోడళ్లను ఎక్స్చేంజ్ చేస్తే ఫోన్ అసలు ధర కంటే చాలా తక్కువకే లభిస్తోంది.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, Galaxy S25 5G తన క్లాస్‌లోని ఇతర ఫోన్లతో పోల్చితే చాలా స్ట్రాంగ్ ప్యాకేజ్‌ను అందిస్తోంది. 6.2 ఇంచుల Dynamic AMOLED 2X డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో విజువల్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ మంచి ఫోటోగ్రఫీ పనితీరును ఇస్తుంది. 12GB RAM, 4,000mAh బ్యాటరీతో రోజువారీ పనులు, గేమింగ్, మల్టీటాస్కింగ్ మొత్తాన్ని స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మంచి క్వాలిటీతో రావడం సెల్ఫీ లవర్స్‌కు మంచి అదనపు ప్లస్. ఈ ఫోన్‌ను అదే పనిగా ఉపయోగించినా, వీడియోలు షూట్ చేసినా, హెవీ గేమ్‌లు ఆడినా, పనితీరు మాత్రం తగ్గిపోదు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 5 జీ (Samsung Galaxy S25 5G) లో ఉన్న స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ దాన్ని ప్రాక్టికల్లీ చిన్న మాన్స్టర్‌లా మార్చేస్తుంది. ఈ ప్రాసెసర్ వేగం, స్మూత్ టాస్క్ హ్యాండ్లింగ్, పవర్ ఎఫిషియెన్సీ లో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి తోడు పెద్ద వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఫోన్ ఎక్కువసేపు వాడినా హీట్ ఎక్కువగా రాదు. కాంపాక్ట్ సైజ్ ఉన్నప్పటికీ పనితీరులో మాత్రం ఎక్కడా రాజీపడకపోవడం Galaxy S25 5Gని ఇంత బలంగా నిలబెట్టే కారణం. ధర తగ్గింపుతో పాటు స్పెసిఫికేషన్లు కూడా ఇంత బలంగా ఉండటంతో, ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తక్కువ ఖర్చుతో కొనాలనుకునే వారికి ఈ బ్లాక్ ఫ్రైడే డీల్ నిజంగా మిస్ అవ్వకూడని ఆఫర్‌గా మారింది.

