Medchal: వెంచర్ కోసం నాలా నే కబ్జా చేశారు. తన వెంచర్ కు రోడ్డు కోసం నాలాను మట్టితో పూడ్చివేసిన సంఘటన గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. కబ్జాకు గురైన నాలాను హైడ్రా ఇరిగేషన్ ఏఈ అర్చన పరిశీలించే వరకు స్థానిక ఇరిగేషన్ అధికారుల కు సోయి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువుల పరిరక్షణ ఇరిగేషన్ అధికారులు పాటుపడాల్సి ఉండగా ఇక్కడ మాత్రం మాకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. నాలాను కబ్జా చేయడం వల్ల ప్రధాన రహదారికి తన వెంచర్ దగ్గరవుతుందన్న దురుద్దేశంతో నాలాను మట్టితో పూడ్చి నాలాపై నుంచి రోడ్డు వేసుకున్నారు అంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రధాన రహదారి పక్కనే నాలా కబ్జా
గుండ్ల పోచంపల్లి నుండి మేడ్చల్ కు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ రోడ్డు పక్కనే సుతారి గూడ చెరువు ఉండగా దాని పక్కనే ఈ చెరువు సంబంధించిన నాలా ఉంది. అయితే ఈ నాల కింద భాగంలో ఓ ప్రైవేట్ వెంచర్ ఉంది. ప్రధాన రహదారి నుండి వెంచర్ కి వెళ్లాలంటే రోడ్డు లేకపోవడంతో అ వెంచర్ యజమానుల కన్ను అక్కడే ఉన్న నాలాపై పడింది. ఇంకేంటి నాలాను కబ్జా చేసి దానిపై మట్టి కప్పి రోడ్డును వేయాలన్న ఆలోచన ఆ వెంచర్ యజమానులకు వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read: Medchal Municipality: ఆ మున్సిపల్‌లో ఏం జరుగుతుంది.. మున్సిపల్ కమిషనర్ ఉన్నట్లా? లేనట్లా..?
నాలపై మట్టి పోసి అక్కడ రోడ్డును ఏర్పాటు
దీంతో 40 ఫీట్ల వరకు ఉన్న ఈ నాల పై మట్టి పోసి అక్కడ రోడ్డును ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నాలా ద్వారా బయటకు వెళ్లాల్సిన నీరు వెళ్లకపోవడంతో స్థానికులు నాలాలో వేసిన మట్టిని తొలగించారు. దీంతో 40 ఫీట్ల వరకు ఉండాల్సిన నాలా 10 ఫీట్లకు కుదించిక పోయింది. ఈ విషయంపై స్థానికులు హైడ్రా ఇరిగేషన్ డి ఈ అర్చన దృష్టికి తీసుకెళ్లగా స్వయంగా నాలా వద్దకు వెళ్లి పరిశీలించారు. వాస్తవానికి నాలా 40 ఫీట్ల వరకు ఉంటుందని, అయితే ప్రస్తుతం 10 ఫీట్లు కు కుదించుకుపోయిందని స్థానికులు హైడ్రా ఇరిగేషన్ డి ఇ కి వివరించారు. ఇలా ఎవరికి వారు నాలాలను కబ్జా చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలని స్థానికులు పేర్కొంటున్నారు.
నాలా కబ్జా ను కమీషనర్ దృష్టికి తీసుకెళ్తా
సరైన ఆధారాలు ఇస్తే నాలా కబ్జా విషయాన్ని హైడ్రా కమీషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్తానని హైడ్రా ఇరిగేషన్ డి ఈ అర్చన తెలిపారు. కబ్జాకు గురైన నాలను పరిశీలించిన అనంతరం తనకు సరైన వివరాలను అందజేస్తే హైడ్రా కమీషనర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
Also Read: Medchal Crime: పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి.. భారీ నగదు స్వాధీనం

