Gajwel: ప్రభుత్వ శాఖల్లో పైసా ఇవ్వందే పని జరగదు
Gajwel ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Gajwel: ప్రభుత్వ శాఖల్లో పైసా ఇవ్వందే పని జరగదు.. అన్ని శాఖల్లోనూ లంచం కంపు!

Gajwel: ప్రభుత్వ శాఖల్లో లంచం (అవినీతి) పడగ విప్పుతుంది. ‘పైసా ఇవ్వందే పని జరగదు’ అన్న స్థాయికి పరిస్థితులు దిగజారాయి. న్యాయాన్ని అన్యాయంగా మార్చి, అమాయకుల ఆస్తులను అక్రమంగా మరొకరి సొంతం చేస్తూ, చివరకు మనిషి మానవత్వాన్నే మరిపిస్తున్న ఈ అవినీతి రక్కసిపై ప్రజల్లో తీవ్రస్థాయిలో తిరుగుబాటు మొదలైంది. పట్టణాల నుంచి పల్లెటూళ్ల వరకు అన్ని ప్రాంతాల్లోనూ అసహనం పెరిగి ఉద్యమ రూపం దాలుస్తుంది.

అన్ని శాఖల్లోనూ అవినీతి జలగలు

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల నుంచి, సేవ చేయాల్సిన కింది స్థాయి ఉద్యోగులు, వారిని కట్టడి చేయవలసిన ఉన్నతాధికారులు సైతం ఈ అవినీతికి పాల్పడుతున్నారు. రెవెన్యూ రికార్డులు కావాలన్నా, అభివృద్ధి పనులకు బిల్లులు చేయాలన్నా, చివరికి విద్యుత్ పనులకైనా డబ్బులివ్వందే పని జరగడం లేదు. పంచాయతీరాజ్, ఆర్టీవో, సబ్-రిజిస్ట్రార్ వంటి అనేక శాఖల్లో లంచం లేకుండా అడుగు ముందుకు పడడం లేదు. తమ బాధ్యతలను మరిచిన ఉద్యోగులు, స్వార్థంతో అమాయకుల జీవితాలను పెను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

Also Read: Gajwel News: మరింత విస్తరించనున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ.. ఎలాగో తెలుసా!

ఏసీబీ వలలో అధికారులు..

ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎంతోమంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వలలో చిక్కుకోవడం గమనార్హం. బిల్ కలెక్టర్ నుంచి సబ్ కలెక్టర్ వరకు అవినీతి కేసుల్లో పట్టుబడుతున్నారు.

– మిషన్ భగీరథ డీఈఈ సంధ్యారాణి రూ. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
– మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్సై రాజేశ్ రూ. 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడి, ఏసీబీ నుంచి తప్పించుకోవడానికి పారిపోవడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
– సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయకుమార్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కబ్జా విడిపించడం కోసం రూ. 50,000 డిమాండ్ చేసి కానిస్టేబుల్ రాజుతో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
– ఇలా రోజుకో అవినీతి అధికారి ఏసీబీకి దొరకడం, లంచావతారం పోలీస్ వ్యవస్థకు పట్టిన దిష్టిలా మారడాన్ని స్పష్టం చేస్తుంది. ప్రజల చైతన్యంతో అవినీతి అధికారుల అంతు తేలుస్తున్నప్పటికీ, వారిలో మార్పు రాకుండా అవినీతి యధావిధిగా కొనసాగుతూనే ఉంది.

చర్యలు కఠినంగా ఉండాలి..

లంచం తీసుకుంటూ అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు మరింత కఠినతరం చేయాలని ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఏసీబీ దాడుల్లో సస్పెండ్ అయిన అధికారులు కొంతకాలం తర్వాత తిరిగి విధుల్లో చేరి, మళ్లీ అవినీతికి పాల్పడడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉంది. ప్రస్తుత చట్టాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతుంది.

ఎన్నికల ఎజెండాగా అవినీతి అంతం..

సంక్షేమ పథకాలపై ఎన్నికల సమయంలో దృష్టి సారించే రాజకీయ పార్టీలు, అతి త్వరలో అవినీతి అంతం పై కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో వస్తున్న ఈ పోరాటాన్ని ప్రభుత్వాలు, పార్టీలు గుర్తించక తప్పదు. వచ్చే ఎన్నికల్లో అవినీతి అంతంపై ఏ పార్టీ హామీగా ప్రకటిస్తుందో, ఆ పార్టీకి ప్రజల మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రజా తిరుగుబాటు ప్రభుత్వాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

Also Read: Mahabubabad District: చిన్నపిల్లల వ్యాక్సిన్ లపై సిబ్బంది నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డీఈఈ 

జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)గా పనిచేస్తున్న కూనమల్ల సంధ్యారాణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఓ బాధితుడికి సంబంధించిన బిల్లు మంజూరు విషయంలో డీఈఈ సంధ్యారాణి రూ. 10,000 లంచం డిమాండ్ చేశారు. దీనిపై సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటుండగా డీఈఈ సంధ్యారాణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం