VC Sajjanar: సైబర్ మోసాలకు చెక్ పెట్టేది ప్రజల అవగాహన
VC Sajjanar ( image credit: swetcha reporter)
హైదరాబాద్

VC Sajjanar: సైబర్ మోసాలకు చెక్ పెట్టేది ప్రజల అవగాహన మాత్రమే : హైదరాబాద్ సీపీ సజ్జనార్

VC Sajjanar: ప్రజల్లోని భయం, అత్యాశే సైబర్ క్రిమినల్స్ పెట్టుబడి అని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) స్పష్టం చేశారు. స్వీయ అవగాహన పెంచుకోవడం ద్వారానే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన అన్నారు. చారిత్రాత్మక చార్మినార్ వద్ద సైబర్ నేరాలపై ‘జాగృత్.. సురక్షిత్ హైదరాబాద్’ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను సైబర్ నేరరహితంగా మార్చే లక్ష్యంతో ప్రతి మంగళ, శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరైన అవగాహన లేకపోవడం, అత్యాశ, భయం కారణంగానే చాలామంది సైబర్ క్రిమినల్స్ చేతుల్లో మోసపోతున్నారని సీపీ అన్నారు.

Also Read: VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

మొబైల్ ఫోన్ ఇచ్చే ముందు జాగ్రత్తలు చెప్పాలి

సైబర్ నేరాలకు కళ్లెం వేయడానికి ప్రజలు ‘సైబర్ సింబాలుగా’ ముందుకు వచ్చి సహకరించాలని సూచించారు. ప్రైవేట్ ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయవద్దు. పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ ఇచ్చే ముందు జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. ఇటీవల సైబర్ క్రిమినల్స్ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మోసాలు చేస్తున్నారని, నిజానికి ఏ దర్యాప్తు సంస్థ కూడా డిజిటల్ అరెస్ట్ చేయదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. సైబర్ మోసానికి గురైతే, మొదటి గంటలోనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని లేదా జాతీయ సైబర్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్) ఎం. శ్రీనివాస్, సౌత్ జోన్ అదనపు డీసీపీ మాజిద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:VC Sajjanar: సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్‌మీట్​ ఏంటి? సామాన్యులతో ఇలా ఎప్పుడైనా మీడియాతో మాట్లాడారా?

Just In

01

Gadwal District: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. పట్టుకుని వదిలేసిన పీడిఎస్ బియ్యం వాహనం ఎవరిది?

Khammam Municipal Elections: ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం.. 10 ఏళ్ల ప్రత్యేక అధికారి పాలనకు ముగింపు?

Medaram Jatara 2026: మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్.. మూడు కోట్ల భక్తుల కోసం సమగ్ర ప్రణాళిక!

Ranga Reddy District: రైతుల భూములపై రియల్టర్ల కన్ను.. ఫామ్ ల్యాండ్ వెంచర్లపై నియంత్రణ ఎక్కడ?

Municipal Elections: మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!