Hidma Flex Banner: హనుమ కొండ జిల్లా వేలేరులో హిడ్మా(Hidma) ఫ్లెక్సీల కలకలం రేపింది. పోరాట వీరుడా వందనం అంటూ ఫ్లెక్సీలో గుర్తు వ్యక్తులు పేర్కొన్నారు. విషయం తెలిసిన పోలీసులు(Police) సంఘటన స్థలం చేరుకుని ఫ్లెక్సీ తొలగించారు.
హిడ్మా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సురేష్(Suresh), బుచ్చయ్య అనే ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తే కఠిన చర్యలుంటాయని పోలీసుల హెచ్చరిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
హనుమకొండ జిల్లాలో హిడ్మా(Hidma) ఫ్లెక్సీ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కొయ్యడ సురేష్, బుచ్చయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సెక్షన్లు 196, 353(1)(b) BNS, సెక్షన్ 8(2) ఆఫ్ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిషేధిత సంస్థల్లోని వ్యక్తుల ఫ్లెక్సీలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి(ACP Prashanth Reddy) హెచ్చరించారు. వేలేరు మండలంలోని షోడశపల్లిలో హిడ్మా ఫ్లెక్సీ ఏర్పాటు ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ అన్నారు.
Also Read: Harish Rao: ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్!
దశాబ్దాలుగా అజ్ఞాతంలో..
కాలం చెల్లిన మావోయిస్టు సిద్ధాంతాన్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దన్నారు. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నవారే నిజం తెలుసుకొని లొంగిపోతున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలను ఉపేక్షించేది లేదు. యువత ఆలోచనలు మంచి మార్గం వైపు ఉండాలి. సోషల్ మీడియాను చూసి మావోయిస్టులకు సానుభూతి తెలపడం సరికాదని ఏసిపి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read; Koratla MLA: ఇందిరమ్మ ఇండ్లకు డబ్బు అడిగితే.. రోకలి బండతో కొట్టండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే

