Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S EV వచ్చేస్తోంది..
Mahindra ( Image Source: Twitter)
బిజినెస్

Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S EV వచ్చేస్తోంది.. రిలీజ్‌కు ముందే లీకైన ఫీచర్స్

Mahindra XEV 9S: మహీంద్రా ఎలక్ట్రిక్ SUV XEV 9S కోసం మరో కొత్త టీజర్‌ను విడుదల చేసింది. నవంబర్ 27, 2025న గ్లోబల్ డెబ్యూ చేసుకోనున్న ఈ 7-సీటర్ SUVలో, కంపెనీ ప్రత్యేకంగా హైలైట్ చేసిన ఫీచర్ ‘బాస్ మోడ్’. ఈ ఫీచర్‌తో ముందు ప్యాసింజర్ సీట్‌ను ఒక బటన్‌తో వెనక్కి స్లయిడ్ చేయవచ్చు. దీనివల్ల వెనుక కూర్చున్న ప్రయాణికుడికి అదనపు లెగ్‌రూమ్ దొరుకుతుంది. డ్రైవర్‌తో ప్రయాణించే వారికి ఇది పెద్ద అడ్వాంటేజ్ కానుంది. టాటా ఇప్పటికే హారియర్ EV, సఫారి మోడల్స్‌లో ఈ ఫీచర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహీంద్రా కూడా అదే దారిలో నడుస్తోంది.

Also Read: CM Revanth Reddy: నేషనల్ స్పోర్ట్స్ మీట్.. ఛాంపియన్ షిప్‌ను సాధించిన తెలంగాణ.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి!

ఇంటీరియర్ విషయంలో కూడా XEV 9S ప్రీమియం లుక్‌తో పాటు హై-టెక్ ఫీచర్లను అందించనుంది. ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఇందులో ప్రధాన ఆకర్షణ. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిజిటల్ క్లస్టర్, అలాగే ముందు ప్యాసింజర్ కోసం ప్రత్యేక స్క్రీన్ ఉంటుంది. అదనంగా పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్‌డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, లెవెల్ 2 ADAS, ఇల్యూమినేటెడ్ లోగోతో వచ్చిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Also Read: Kalalaku Rekkalu Scheme: ఏపీలో కూటమి సర్కార్ శుభవార్త.. ‘కలలకు రెక్కలు’ పథకంపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

బయటి డిజైన్ చూస్తే క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ DRLs, ఏరో స్టైల్ వీల్స్, LED టెయిల్‌ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. INGLO ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన ఈ SUV, XUV700కి ఎలక్ట్రిక్ 7-సీటర్ వేరియంట్ లాగా రూపుదిద్దుకుంది. XEV 9e మోడల్‌లా 59kWh ,  79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుందని అంచనా. పెద్ద బ్యాటరీ ఉన్న మోడల్ ఒక్క ఛార్జ్‌తో 600km కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: Thummala Nageswara Rao: చేనేత రంగానికి రూ.వెయ్యి కోట్లు.. ఏడాదిన్నరలోనే ఖర్చు చేశాం : మంత్రి తుమ్మల

Just In

01

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?

GHMC Delimitation: గూగుల్ మ్యాప్స్ ఆధారంగా పునర్విభజన.. తలసాని విమర్శనాస్త్రాలు

Corporator Shashikala: నా వార్డును పునర్విభజించే హక్కు మీకెవరిచ్చారు?: కార్పొరేటర్ శశికళ

IPL Auction 2026: అన్‌సోల్డ్ ప్లేయర్‌‌ని రూ.13 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎవరంటే?