Jupally Krishna Rao: రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు, సెమినార్‌ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో తెలంగాణ వారసత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తోంది.
Also Read: Jupally Krishna Rao: కర్నూల్ బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం.. మంత్రి జూపల్లి
నాణేల చరిత్ర ద్వారా తెలంగాణ రాష్ట్ర గొప్ప చారిత్రక,
రాష్ట్ర ఆవిర్భావం తరువాత నాణేల అధ్యయనంపై ఇంతటి ముఖ్యమైన జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ, నాణేల చరిత్ర ద్వారా తెలంగాణ రాష్ట్ర గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో డిసెంబర్ 11, 12న ఈ సదస్సు జరగనుంది. దేశ నలుమూలల నుంచి విద్యార్థులు, స్కాలర్స్, పరిశోధకులు, న్యూమిస్‌మటిక్స్ నిపుణులు పాల్గొనే ఈ సదస్సు, నాణేల చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక ప్రాముఖ్యతపై చర్చించేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
Also Read:Jupally Krishna Rao: కర్నూల్ బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం.. మంత్రి జూపల్లి
