Jupally Krishna Rao: పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్పకళావేదికలో బుధవారం నిర్వహించిన దక్షిణ భారత అతి పెద్ద సీఎస్‌ఆర్ సమ్మిట్ రెండో ఎడిషన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఎంపవరింగ్ చేంజ్, బిల్డింగ్ టుమారో’ అనే అంశం ఈ సమ్మిట్‌కు సరైన ఆత్మగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు మన రాష్ట్రానికి వస్తున్నారన్నారు. మన సంప్రదాయాలు, పండుగలు, హస్తకళలు, వంటకాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయన్నారు.
Also Read: Jupally Krishna Rao: కేసీఆర్ ఫ్యామిలీ లిక్కర్ దందా అంబాసిడర్లు: మంత్రి జూపల్లి కృష్ణారావు
పర్యాటక ప్రదేశాన్ని దత్తత తీసుకోవాలి
పర్యాటకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందన్నారు. స్థానిక కళాకారులు, గేయకారులు, చిరు వ్యాపారులు ఉపాధి పొందుతున్నారన్నారు. కార్పొరేట్ విజయాన్ని సామాజిక ప్రగతితో కలిపే వారధి సీఎస్‌ఆర్ అని పేర్కొన్నారు. వారసత్వ కట్టడాల సంరక్షణ, యువత నైపుణ్యాభివృద్ధి, సంప్రదాయ కళల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఇది కీలకంగా నిలుస్తుందని వివరించారు. అన్ని సంస్థలు ఒక్కో పర్యాటక ప్రదేశాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. ఇది కేవలం ఆర్థిక సహకారం కాదు.. బాధ్యతతో కూడిన భాగస్వామ్యం అన్నారు. ప్రభుత్వం కూడా దత్తత తీసుకున్న సంస్థలకు తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. ఈ సమ్మిట్‌లో 300కు పైగా కార్పొరేట్ సంస్థలు, 100 ఎన్‌జీఓలు పాల్గొనడం గర్వకారణమని పేర్కొన్నారు. ‘బచ్పన్ బచావో’ సంస్థను కమ్యూనిటీ పార్ట్‌నర్‌గా ఎంపిక చేసినందుకు ప్రశంసించారు.
Also Read:Jupally Krishna Rao: పర్యాటకంలో సుస్థిర అభివృద్ధే లక్ష్యం.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
