Jogulamba Gadwal: గద్వాల్లో రాజ్యమేలుతున్న కల్తీ రాయుళ్లు
Jogulamba Gadwal (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల్లో రాజ్యమేలుతున్న కల్తీ రాయుళ్లు.. అధికారుల చర్యలు నిల్.. కల్తీ ఫుల్!

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో హోటల్స్(Hotels), టిఫిన్ సెంటర్స్, రెస్టా రెంట్ లలో ఆహార పదార్థాల తయారీలో నాసిరకం సరుకులు ఉపయోగిస్తూ నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత కరు వవడంతో గాలిలో దీపంల ప్రజల ఆరోగ్యం మారుతోంది. పట్టణ పరిధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్ లు, ధాబాలు, వెలుస్తుం డగా ఇక టిఫిన్ సెంటర్లు పుట్టగొడుగుల్ల పుట్టుకోస్తున్నాయి. వినియోగదారుల అభివృద్ధి తగ్గట్లు టీ స్టాల్ లు, ఐస్ క్రీమ్ సెంటర్లు,వివిధ రకాల టిఫిన్ సెంటర్ లతో పాటు మెస్ లు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర స్నాక్స్ షాపులు పుట్టుకొస్తున్నాయి. వాటి నిర్వాహకులు నిబంధనలు తుంగలో తొక్కి నాణ్యత లేని ఆహార పదార్థాలు అమ్ముతు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రజలు రోగాలబారిన పడి ఆసుపత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. గద్వాలను జోగులాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు అనంతరం వివిధ అవసరాల నిమిత్తం గద్వాలకు వివిధ మండలాలు,గ్రామాల నుండి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారు తమ పనుల సమయంలో టిఫిన్ తో పాటు భోజనం చేస్తున్నారు. నాణ్యత లేని ఆహారం తిన్న వారు అనారోగ్యం పాలు అవుతున్నారు. ఇక రెస్టారెంట్ లు స్వీట్ హౌస్ లను అడిగేవారే కరువయ్యారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో నిర్వాహకులు ఇచ్చిందే ఆహారంగా వినియోగదారులు తీసుకోవాల్సి వస్తోంది.

తనిఖీలు శూన్యం

జిల్లాలో పెరుగుతున్న జనాభా కనుగుణంగా అనేక ఆహార పదార్థాల షాపులు వెలుస్తున్నా ఆదిశగా ఆహార పదార్థాల నాణ్యత పై పర్యవేక్షణ లేకపోవడంతో వినియోగదారులు పోషకాలు కలిగిన నాణ్యమైన ఆహార పదార్థాలను పొందలేకపోతున్నారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుండగా స్థానిక మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు సైతం ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తనిఖీలు చేపడుతున్న సందర్భాలు లేవు. తాజా మాంసం వినియోగంలోకి రాకుంటే తర్వాత రోజులలో సైతం వినియోగించుకునేందుకు ఫ్రిజ్ లలో ఉంచుతున్నారు. హోటళ్లు, రెస్టా రెంట్ లలో రోజుల తరబడి ఫ్రిజ్ ల్లో నిలువ ఉంచడంతో అవి కుళ్లి పోయి దుర్వాసన వచ్చిన సంఘటనలు గతంలో గద్వాల రూరల్ ఎస్సైగా అంజాద్ అలీ నిర్వహించిన తనిఖీలలో బయటపడ్డాయి.

Also Read: Etela Rajender: ధాన్యం కొనుగోళ్లలో అన్యాయం.. ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల ఆగ్రహం!

ప్రత్యేక మసాలాలు చల్లి

తాజాగా ఓ టిఫిన్ సెంటర్ లో చట్నీలో బల్లి, ఓ మెస్ లో మధ్యాహ్న భోజనంలో చనిపోయిన ఈగ వచ్చింది. ఇలా అనేక చోట్ల పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి .ఆహార పదార్థాలపై ప్రత్యేక మసాలాలు చల్లి నూనెలో వేయించి ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటు న్నారు. హోటళ్లు, రెస్టారెంట్ లలో వంట మాస్టర్ లు, సర్వర్లు ప్రత్యేక దుస్తులు ధరించాల్సి ఉంటుంది. అలాగే స్వీట్ హౌస్ లలో తినుబండరాలు నాణ్యత లడ్డులు, గులాబ్ జామ్ లు, మైసూర్ పాక్ లతో పాటు ఇతర తీపి పదార్థాలు కాలం చెల్లినవి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటు న్నారు. ఆహార పదార్థాల తనిఖీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో లాభాపేక్షకు పాల్పడుతున్న వ్యాపారులకు వరంగా మారింది. వంట గదుల పరి శుభ్రపై చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు హోటళ్లు, రెస్టారెంట్, స్వీట్ హౌస్ లపై నిత్యం తనిఖీలు చేపట్టి ప్రజల ఆరోగ్యం రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పర్యవేక్షణ చేపడతాం: జానకిరామ్ మున్సిపల్ కమిషనర్

గద్వాలలో రోజురోజుకి ఫుడ్ కు సంబంధించిన దుకాణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న మాట వాస్తవమే. వాటి నిర్వాహకులు ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలను పాటించాలి. కాలం చెల్లిన, నాసిరకపు వస్తువుల వాడకం, పరిశుభ్రత లేని దుకాణాలపై దృష్టి పెడతాం. వినియోగదారులు నాణ్యత విషయంలో తేడా అనిపిస్తే సంబంధిత మున్సిపాలిటీలో ఫిర్యాదు చేయవచ్చు.

Also Read: Hyderabad: హైడ్రా మరో సంచలనం.. బ‌డాబాబుల ఆగ‌డాల‌కు చెక్.. రూ.700 కోట్ల భూమి సేఫ్

Just In

01

Local Body Elections: నగదు లేకుంటే బరిలోకి రాకండి.. ఆశావహులకు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల ఆదేశాలు!

Panchayat Elections: ఏకగ్రీవాల వైపు అడుగులేస్తున్న గ్రామాలు.. పార్టీలకు అతీతంగా పాలకవర్గం ఎంపిక!

Euphoria Teaser: గుణశేఖర్ ‘యుఫోరియా’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఏం థ్రిల్ ఉంది మామా..

Shocking Crime: దేశంలో ఘోరం.. భార్యను కసితీరా చంపి.. డెడ్ బాడీతో సెల్ఫీ దిగాడు

Bigg Boss Telugu 9: ఇమ్మాన్యూయేల్ వ్యవహారంపై ఫైర్ అయిన రీతూ.. డీమాన్ పవన్ కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా..