GHMC: మొండి బకాయిల పై జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం
GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: మొండి బకాయిల పై జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం.. అందుకు వ్యూహం సిద్ధం

GHMC: రాష్టంలోనే అతి పెద్ద స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీ(GHMC) జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపార్టీ ట్యాక్స్(Property tax) మొండి బకాయిలపై బల్దియా ప్రత్యేకంగా ఫోకస్ చేయనుంది. ఏళ్ల తరబడి వసూలు కాకుండా పేరుకుపోయిన సుమారు రూ. 10 వేల కోట్లలో వర్తమాన ఆర్థిక సంవత్సరం కనీసం రూ. వెయ్యి కోట్ల వరకు వసూలు చేసుకునేందుకు వ్యూహాం సిద్దం చేసింది. ఇందుకు గాను వన్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) ను ఈ సారి రెండు నెలల పాటు అమల్లోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ యోచిస్తుంది. ఇందుకు గాను గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఈ తీర్మానాన్ని సర్కారుకు పంపి ఫిబ్రవరి, మార్చి నెలాఖరు వరకు ఓటీఎస్ ను అమలు చేసేందుకు అవసరమైన అనుమతినివ్వాలని స్టాండింగ్ కమిటీ సర్కారును కోరుతుంది.

పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్..

సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మాసమైన మార్చి మాసంలో పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల వసూళ్ల కోసం సర్కారు వడ్డీ రాయితీని అనుమతిస్తుంది. కానీ ఈ సారి ఒక నెల ముందు అంటే ఫిబ్రవరి, మార్చి రెండు నెలల పాటు ఓటీఎస్ ను అమల్లోకి తీసుకువస్తే మొండి బకాయిలు కొంత మేరకైనా వసూలవుతాయని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఫలితంగా పీకల దాక అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఆర్థికంగా కాస్త ఊరట కల్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రెండు నెలల పాటు అమల్లో ఓటీఎస్​ ను ఉంచి, దాని కింద మొండి బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వాలని సర్కారును కోరుతూ ప్రతిపాదనలు పంపించాలని స్టాండింగ్ కమిటీ లో నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఓటీఎస్ స్కీమ్ తో ఈ ఏడాది అధికారులు రూ. వెయ్య కోట్ల ట్యాక్స్ కలెక్షన్ కు టార్గెట్ పెట్టుకున్నట్ల్లు, ఇందుకు సంబంధించి జనవరి మాసంలో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు డైలీ టార్గెట్లు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. జనవరి మాసం నుంచి మొండి బకాయిలపై మూడు నెలల పాటు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే కనీసం దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నట్లు సమాచారం.

Also Read: Kashmir Times: ‘కశ్మీర్ టైమ్స్’ కార్యాలయంలో సోదాలు.. ఏమేం దొరికాయో తెలిస్తే షాకే!

నెల ముందు నుంచే కలెక్షన్ పై ఫోకస్

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఈ సారి అధికారులు నెల రోజుల ముందు నుంచే ఫోకస్ పెట్టనున్నారు. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం జనవరి మాసం నుంచి మార్చి నెలాఖరు కల్లా కలెక్షన్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించే ట్యాక్స్ వింగ్ అధికారులు ఈ సారి డిసెంబర్ మాసం నుంచే కలెక్షన్ పై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో నెలకున్న ఆర్థిక సంక్షోభం, వేల కోట్లలో పేరుకుపోతున్న మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ మాసం నుంచే నోటీసులను జారీ చేస్తూ, కలెక్షన్ ఫీల్డు స్టాఫ్ అయిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లను పరుగులు పెట్టించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ. 1426 కోట్ల వసూలు కాగా, ఈ సంవత్సరం టార్గెట్ గా రూ. 2500 కోట్ల కలెక్షన్ పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.1426 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ కాగా, టార్గెట్ కు మిగిలిన రూ. 1074 కోట్లను రానున్న మార్చి నెలాఖరు కల్లా కలెక్షన్ చేసుకునేందుకు అధికారులు వ్యూహాం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల వరకు మొండి బకాయిలున్నా, వీటిపై స్పెషల్ గా ఫోకస్ చేసి 145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, మరో 323 మంది బిల్ కలెక్టర్లకు భారీ టార్గెట్లు ఇస్తే, కనీసం రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల మధ్య ఈ బకాయిలు వసూలవుతాయని అధికారులు అంఛనాలేస్తున్నారు.

Also Read: Harish Rao: సిగాచి బాధితులకు ఇచ్చింది రూ.26 లక్షలే.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క