Collector Hanumanth Rao: భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్న గూడెం లోని ఇందిరమ్మ కాలనీ లో నివాసం ఉంటున్న పదవ తరగతి విద్యార్ధిని బానోతు సుస్మిత ఇంటికి వెళ్లి ఎందుకు రోజు స్కూల్ కి వెళ్లడం లేదని సుస్మిత ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సుస్మిత ఇంట్లో పరిస్థితి పై ఆరా తీశారు. ఇంట్లో వాళ్ళ అమ్మ గారికి ఆరోగ్యం సరిగా లేదని , నాన్న మేస్త్రి పనికి వెళతారని,అమ్మ కి తోడుగా ఎవరు లేకపోవడం వలన ప్రతి రోజు బడికి వెళ్లలేక పోతున్నానని కలెక్టర్ కు వివరించిన సుస్మిత కలెక్టర్ సుస్మిత ఇంటికి వెళ్లిన సమయంలో వాళ్ల అన్నయ్య అమ్మ గారిని తీసుకొని ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని సుస్మిత కలెక్టర్ కు తెలిపారు.
మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. నువ్వు మాత్రం రేపటి నుండి రోజు తప్పని సరిగా స్కూల్ కి వెళ్ళాలని, మంచిగా చదువుకోవాలని అన్నారు.విద్యార్థిని స్కూల్ కి రాని రోజు ఇంటి వద్ద నుండి చదువుకోవడానికి సదుపాయాలు సరిగా లేవని తెలుసుకొని సాయంత్రం లోపు స్టడీ చైర్. రైటింగ్ పాడ్ పంపించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిగా గణితం బోధించి పిజిక్స్ ఫార్ములాలు అడిగిన కలెక్టర్
విద్యరులు కష్టపడి చదివి పదవ తరగతిలో 100% శాతం ఉత్తీర్ణత సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.ఉపాధ్యాయుడిగా కలెక్టర్ గణితం బోధించి ,విద్యార్థులనుపిజిక్స్ లో ఫార్ములాలు అడిగిన కలెక్టర్. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భగాయత్ జెడ్పీ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులు ఎంత మంది ఉన్నారని , అందులో పదవ తరగతిలో ఎంత మంది విద్యార్థులు చదువు తున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రోజు పాఠశాలకు వస్తున్నారా అని పాఠశాలకు రాని విద్యార్థుల ఇండ్లకు ఫోన్ చేసి ఎందుకు రావట్లేదో ఆరా తీసి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే విధంగా చూడాలన్నారు. ఉపాధ్యాయులు కూడా వార్షిక పరీక్షల వరకు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని , అనవసర సెలవులు తీసుకోవద్దని సూచించారు.
విద్యార్థులపై చొరవ చూపాలి
గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన జిల్లా పదవ తరగతి పరీక్షలల్లో 100% శాతం ఉత్తీర్ణత సాధించేల ఉపాధ్యాయులు ఇప్పటి నుండే విద్యార్థులపై చొరవ చూపాలని , విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చెప్పిన విధంగా రోజు శ్రద్ధగా చదువుతూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ఏదైనా సబ్జెక్ట్ లో సందేహాలుంటే ఉపాధ్యాయులు ద్వారా నివృత్తి చేసుకోవాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
నాణ్యత సరిగా లేదని వెంటనే మార్చుకోవాలి
పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కిచెన్ లో వంట సామగ్రిని పరిశీలించి, వంట సరకులైన కారం ,పసుపు, చింతపండు నాణ్యత సరిగా లేదని వెంటనే మార్చుకోవాలని సూచించారు. పాఠశాలలో నిర్మాణ పనులు ఆగిన తరగతి గదులను పరిశీలించి , వెంటనే పనులను మొదలుపెట్టి త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత పంచాయతీరాజ్ ఏఈ కి ఆదేశాలు జారీ చేశారు.కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
