Khammam Brutal Murder: భార్యను హత్య చేసి.. కూతురుపై
Khammam Brutal Murder (Image Source: Freepic)
క్రైమ్

Khammam Brutal Murder: ఖమ్మం నడిబొడ్డున ఘోరం.. భార్యను హత్య చేసి.. కూతురుపై దారుణంగా..

Khammam Brutal Murder: మానవ సంబంధాలు నానాటికి బలహీనంగా మారిపోతున్నాయి. చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు, వివాహేతర సంబంధాల కారణంగా భార్యలను భర్తలు దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా తెలంగాణలోనూ ఈ తరహా ఘటనే జరిగింది. ఖమ్మంలో ఓ భర్త.. తన భార్యను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ ప్రాంతానికి చెందిన భాస్కర్, సాయివాణి భార్య భర్తలు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. గతేడాది వరకూ ఎంతో సాఫీగా సాగిన వీరి సంసారంలోకి అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. దీంతో భాస్కర్, సాయివాణిల మధ్య వివాదం చెలరేగింది. తొలినాళ్లల్లో తీవ్రంగా గొడవపడిన ఈ జంట.. కొద్ది నెలల క్రితం విడి విడిగా ఉండటం ప్రారంభించింది.

భార్యపై కక్ష్య పెంచుకొని.. 

భాస్కర్.. తన భార్య, కుమార్తెతో కాకుండా విడిగా జీవిస్తున్నాడు. ఓ ఫంక్షన్ హాల్ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి వచ్చేసినప్పటి నుంచి అతడు భార్యపై కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఉదయం సాయివాణి ఇంటికి వెళ్లిన భాస్కర్.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

Also Read: Narendra Modi: రైతులకు గుడ్ న్యూస్.. 9 కోట్ల18 వేల కోట్లు ఖాతాల్లోకి జమ.. కోయంబత్తూరులో రిలీజ్ చేసిన ప్రధాని

కూతురిపై కూడా..

సాయివాణిని పలుమార్లు కత్తితో పొడవడంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. అయితే తల్లిపై దాడి చేస్తున్న క్రమంలో కూతురు అడ్డుకోబోయింది. దీంతో కూతురిపైనా విచక్షణారహితంగా భాస్కర్ దాడికి తెగబడ్డారు. దీంతో స్థానికులు అడ్డుకొని భాస్కర్ ను నిలువరించారు. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కూతుర్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం భార్య సాయివాణి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Also Read: Artificial Intelligence: AI ప్రపంచాన్ని మార్చబోతోంది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. ఎన్వీడియా బాస్ జెన్సెన్ హువాంగ్

Just In

01

Shocking Crime: దేశంలో ఘోరం.. భార్యను కసితీరా చంపి.. డెడ్ బాడీతో సెల్ఫీ దిగాడు

Bigg Boss Telugu 9: ఇమ్మాన్యూయేల్ వ్యవహారంపై ఫైర్ అయిన రీతూ.. డీమాన్ పవన్ కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా..

Harish Rao: కాంగ్రెస్‌కు సంగారెడ్డి నేతలుగుడ్ బై.. కండువాలు కప్పి ఆహ్వానించిన హరీశ్!

Elon Musk: ఏఐ మాత్రమే మీడియాను ఓడిస్తుంది.. రియల్‌ టైమ్ కంటెంట్‌పై ఎలన్ మస్క్ సంచలన కామెంట్స్

BL Santhosh: అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు.. పార్టీ నాయకులకు బీఎల్ సంతోష్ దిశానిర్దేశం!