Hyderabad Metro: హైదరాబాద్ మహానగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు(Hyderabad Metro Rail Project)ను ప్రస్తుతం ఎల్ అండ్ టీ(L&T) సంస్థ నిర్వహిస్తున్నా, రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా మెట్రోరైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నట్లు కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహా నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖత్తర్(Manohar Lal Khattar) వెల్లడించారు. మంగళవారం నగరంలో సౌత్, వెస్ట్ స్టేట్స్ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
మెట్రోరైలు ఫేజ్ -2
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ హైదరాబాద్ మెట్రోరైలు ఫేజ్ -2 ప్రతిపాదనల పురోగతిని వివరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న హైదారబాద్ మెట్రోరైలు ఫేజ్ -2 కు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ మంజూరీ ఇవ్వాలని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ సర్పరాజ్ అహ్మద్ కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వివిధ సౌత్, వెస్ట్ స్టేట్స్ లో పెండింగ్ లో ఉన్న పట్టణాభివృద్ధి ప్రాజెక్టల గురించి అడిగి తెల్సుకున్నారు.
Also Read: Satish death Case: సీఐ మృతి కేసు దర్యాప్తు వేగవంతం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అర్థమైంది ఏంటంటే?
మూడు కారిడార్ల మెట్రో..
సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ మాట్లాడుతూ తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 162 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు కు సంబంధించిన నిర్ణయాలను వచ్చే మార్చి మాసంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రస్తుతం ఎల్ అండ్ టీ నిర్వహణ చేపడుతున్న హైదరాబాద్ మెట్రోరైలు మొదటి దశలోని మూడు కారిడార్ల మెట్రోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50/50 వాటాగా మున్ముందు నిర్వహణ బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిపాదించి మెట్రోరైలు ఫేజ్-2 ప్రతిపాదనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫీజుబిలిటీ ప్రాతిపదికన సాధ్యాసాధ్యాలను పరిశిలించిన తర్వాతే తుది నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
Also Read: District President: మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్!
