Hero Sirish | అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్
Hero Allu Shirish Latest Movie buddy Trailer Release
Cinema

Hero Sirish: అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్

Hero Allu Shirish Latest Movie buddy Trailer Release: అల్లు శిరీష్ హీరోగా యాక్ట్‌ చేస్తున్న లేటెస్ట్ మూవీ బడ్డీ. ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా, ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించగా, శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ మూవీ జూలై 26న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ రిలీజ్ ఫ్రోగ్రాంని మూవీ యూనిట్‌ గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు శామ్ ఆంటోన్ మాట్లాడుతూ.. జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్‌లో డార్లింగ్ మూవీ చేశాను. అది నా మొదటి సినిమా. ఫస్ట్ మూవీ నుంచే నాపై జ్ఞానవేల్ రాజాకి నమ్మకం ఉంది. ఈ మూవీ కోసం డిస్కషన్ జరిగినప్పుడు నన్ను స్క్రిప్ట్ కూడా అడగలేదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ మూవీ ఇచ్చారు. సీజీ అయ్యాక ఫైనల్ వెర్షన్ మూవీ చూశారు. జ్ఞానవేల్‌కి బడ్డీ మూవీ నచ్చింది. ఆయన తర్వాత నా మీద నమ్మకం ఉంచిన మరో పర్సన్ శిరీష్. నేను డైరెక్టర్ రాజమౌళి ఫ్యాన్. ఆయన చేసిన ఈగ మూవీ ఈ బడ్డీ మూవీకి ఇన్సిపిరేషన్. అనంతరం హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా.. ఓటీటీలో ఇలాంటి సినిమా ఉందని చెప్పారు. నేను వారికి ఎన్ని చెప్పినా అనేది అనుకుంటారని వదిలేశా.

Also Read: కొనసాగుతున్న కల్కి మానియా

బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్‌తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ, ఆడియెన్స్‌ ఎలా రిసీవ్ చేసుకుంటారనుకున్నా. కానీ ఇవాళ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ఆడియెన్స్‌ రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు సినిమా చేద్దామని అన్నా. బడ్డీతో మా కాంబో కుదిరింది. ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యే నేనీ సినిమా చేశా. నా హీరోయిజం చూపించాలని కాదు. జ్ఞానవేల్‌కి థ్యాంక్స్. మా నాన్న కూడా నాపై ఇంత ఖర్చుపెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయలేదు. నాతో భారీ ఖర్చుతో బిగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేశారు జ్ఞానవేల్.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..