Kalki 2898 Ad Advance Booking Tickets Sells 135 lakh Tickets
Cinema

Kalki 2898 AD: కొనసాగుతున్న కల్కి మానియా

Kalki 2898 Ad Advance Booking Tickets Sells 135 lakh Tickets: డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ రిలీజ్‌కు ముందే భాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. జూన్ 27న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్‌ వైడ్‌గా కల్కి మానియా నడుస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ కాగా క్షణాల్లోనే అమ్ముడయ్యాయి.

హైదరాబాద్, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాల్లో ఫస్ట్‌ డే టికెట్స్ మొత్తం సోల్డ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండటంతో టికెట్ ధరలు భారీగా పెంచేశారు. ముంబయిలో అయితే టికెట్ ధరలు పట్టపగలే చుక్కలు చూపెడుతూ ఆకాశాన్నంటుతున్నాయి. ముంబయలోని మైసన్ జియో వరల్డ్ ప్లాజాలో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.2300కి అమ్ముతున్నారు. వర్లీలోని అట్రియా మాల్‌లోని ఇన్ సిగ్నియా, ఫీనిక్స్ పల్లాడియం, లోయర్ పరేల్ లలో ఒక్కో టికెట్ ను రూ.1760, రూ.1560 లకు అమ్ముతున్నారు. చాలా నగరాల్లో కల్కి మూవీ టికెట్ ధరలు రూ.100 నుండి రూ.1100లకు అమ్ముతున్నారు.

Also Read: హాట్‌ లుక్‌లో మెరిసిన తార

తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్మాణ సంస్థ భారీగా టికెట్స్ ధరలను పెంచేసింది. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పర్మీషన్స్ ఇచ్చాయి. ఇక నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ ప్రీ బుకింగ్స్ అయ్యాయి. ఏకంగా $4 మిలియన్స్ ప్రీ సేల్ బిజినెస్ జరిగిందని సినీవర్గాలు తెలిపాయి. రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన తొలి ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది. ఈ మూవీ ప్రీమియర్స్‌కు కూడా లక్ష టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ రిలీజైన ఫస్ట్‌డే వరల్డ్‌ వైడ్‌గా ఆల్‌టైమ్ రికార్డు కలెక్షన్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ మూవీలో బిగ్‌బీ, లోకనాయకుడు, హీరోయిన్స్‌ దీపికా పదుకొణె, దిశా పటాని మెయిన్‌ రోల్స్ పోషించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు