Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. భార్యను రోకలిబండతో అతి కిరాతకంగా కొట్టి చంపిన భర్త

Crime News: భర్త చేతిలో ఓ భార్య హతమైన ఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కారింగుల వెంకన్న గౌడ్(Venkanna Goud) భార్య కారింగుల పద్మ(Padma)(40) మధ్య కొంతకాలంగా కుటుంబ విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకన్న గౌడ్ క్షణికావేశానికి లోనై భార్య పద్మపై రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటనలు పద్మ అక్కడికక్కడే మృతి చెందింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామం 

భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు కూచించుకుపోతున్నాయి. ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటానని భాసలు చేసిన బర్తనే భార్య పాలిట యముళ్ళు అవుతున్నారు. అలాంటి ఘటనతోనే సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక వైపు భర్తలు భార్యలను మట్టు పెడుతుంటే మరికొందరు భార్యలు కూడా భర్తలపై విచక్షణ రహితంగా దాడులు చేయిస్తూ వారి మరణాలకు కారణం అవుతున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రమంతా ఇలాంటి ఘటనలతో తీవ్ర కలకలంలో కూరుకు పోతోంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏ రోజు ఏ భర్తను ఏ భార్య చంపిస్తుందో.. భార్యను ఏ భర్త ఎలా చంపుతున్నాడో కూడా తెలియని కారణాలతో మానవ సంబంధాలకే మనుగడ లేకుండా పోతుంది.

Also Read: Warangal Cold Wave: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి పంజా.. వృద్ధులు, పిల్లలు జాగ్రత్త అంటూ వైద్యుల సూచన

మట్టు పెడుతున్నారు.. లొంగిపోతున్నారు 

కుటుంబ కలహాల నేపథ్యంలో కొందరు హత్యలు చేసుకుంటే మరికొందరు భార్యా భర్తలు మాత్రం అక్రమ సంబంధాలను నేపద్యంలో హత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది భార్యలు అక్రమ సంబంధం పెట్టుకున్న వారితో కుమ్మక్కై భర్తలను చంపిస్తుంటే మరోవైపు భర్తలు భార్యలపై అనుమానాలు పెంచుకుంటూ క్షణికావేశంలో చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా నిత్య కృత్యంగా కనిపిస్తుండడంతో మానవ సంబంధాలు ఎక్కడికి వెళ్తున్నాయో అనే ఆందోళన మొదలైంది. ఇలాంటి కారణాలతో భర్తలను భార్యలు, భార్యలను భర్తలు హత్యలు చేసి నేరుగా పోలీస్ స్టేషన్లో లకు వెళ్లి లొంగిపోతున్నారు. ప్రస్తుతం పద్మ హత్య విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తదుపరి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Mahabubabad: ఉప్పు, కారంతోనే భోజనం తింటున్నాం.. కడుపులో మంటతో విద్యార్థుల విలవిల!

Just In

01

CM Revanth Reddy: తెలంగాణకు ఆర్ఎఫ్‌సీ ఫోర్త్‌ వండర్‌.. పత్రికా రంగంలోనూ కీలక పాత్ర

Sukma Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ కుటుంబంలో కలహాలు.. తేజస్వి టీమ్‌పై రోహిణి తీవ్ర ఆరోపణలు..!

iBOMMA: విచారణలో నమ్మలేని నిజాలు.. వందకి పైగా సైట్లు నడిపిస్తున్న ఇమ్మడి రవి

iBOMMA: ఐబొమ్మ రవి ప్రమోట్ చేసిన యాప్స్ వల్ల అనేకమంది ఆత్మహత్య: సీపీ సజ్జనార్