MLA Mynampally Rohit: మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్(MLA Mynampally Rohit) అన్నారు. పోలీస్(Police) వర్సెస్ జర్నలిస్ట్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు(SP Srnivas Rao) ఆధ్వర్యంలో హోరాహోరీగా ఆదివారం సాగింది. ఇందుకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదిక అయింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జట్టు, మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ జట్టు హోరాహోరీగా తలపడగా పోలీస్ జట్టు విజయం సాధించింది.
క్రికెట్ మైదానం కోసం
ఈ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరై ఇరు జట్లకు ట్రోఫీ ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ మైదానం కోసం తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. క్రీడా స్ఫూర్తితో ఉద్యోగరీత్యా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రశాంతమైన వాతావరణం లో ఈ మ్యాచ్ ఆడడం సంతోషదాయకమన్నారు. మెదక్ పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిరంతరం మెదక్ నియోజకవర్గం అభివృద్ధికై కృషి చేస్తానన్నారు.
Also Read: BRS: జూబ్లీహిల్స్‌లో ఆ స్ట్రాటజీతోనే ఎదురుదెబ్బ.. వ్యూహం విఫలం
క్రీడా స్ఫూర్తితో జర్నలిస్టులు
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస రావు క్రీడా స్ఫూర్తితో జర్నలిస్టులు(Journalist) ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రెండు నెలలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన క్రికెట్ మైదానం పూర్తవుతుందన్నారు. ఇందుకు పిచ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే సహకరించాలని కోరారు. ఈ మైదానం లో పోలీసులే కాకుండా క్రీడా నైపుణ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జర్నలిస్ట్ మిత్రులు, జిల్లా లోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Kunamneni Sambasiva Rao: ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం.. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
