AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? హైడ్రా కమిషనర్!
AV Ranganath ( image credt: swetcha reporter)
హైదరాబాద్

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అంబర్ పేటలోని బతుకమ్మకుంటను సందర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బతుకమ్మ కుంట చుట్టూ వాకర్లతో కలిసి నడిచారు. బతుకమ్మ కుంట అభివృద్ధి పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది వాకింగ్ కు వస్తున్నారు? వారికి బతుకమ్మ కుంట ఎలా ఉపయోగపడుతోంది? ఈ పరిసర ప్రాంత ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ కుంట ఇప్పుడు మాకందరికీ విహార కేంద్రమైందని స్థానికులు కమిషనర్ కు చెప్పారు. బతుకమ్మ కుంట అందుబాటులో రావడంతో ఈ పరిసర ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయని, వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాలు కాపాడుకుంటున్నామని స్థానికులు వ్యాఖ్యానించారు.

Also ReadAV Ranganath: పూడికతీత పనులు ఆపొద్దు.. క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తిప‌త్రం సమర్పించిన విద్యార్థినులు!

హైడ్రాకు ధ్యాంక్స్

ఒకప్పుడు దుర్గంధంతో వ్యాధులు భారిన పడేవాళ్ళమని ఇప్పుడు ఆరోగ్యాలు కాపాడుకుంటున్నామని, పిల్లలకు మంచి క్రీడా స్థలంగా మారిందని చెప్పారు. ఈ చెరువును సెప్టెంబర్ 28న ప్రారంభించామని, చెరువు చుట్టూ వేసిన మొక్కలు పెద్దవైతే మరింత ఆరోగ్యవంతంగా పరిసరాలు మారుతాయని కమిషనర్ రంగనాధ్ వారితో వ్యాఖ్యానించారు. చెరువును ఇంతే శుభ్రంగా కాపాడుకోడానికి హైడ్రాతో కలసి పని చేయాలని అక్కడి వాకర్లను కమిషనర్ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ వాకర్లు సెల్ఫీ ఫోటోలు దిగారు. పలువురు చిన్నారులు బతుకమ్మ కుంట సూపర్, అంటూ హైడ్రాకు ధ్యాంక్స్ అంటూ వ్యాఖ్యానించారు.

Also ReadAV Ranganath Hydraa: నాలాల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలుండొద్దు.. హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన

Just In

01

Deputy CM Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. టీటీడీ వసతి గృహాలకు శంకుస్థాపన

Bus Accident: ఖమ్మంలో స్కూల్ బస్సు బోల్తా.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్‌లో భద్రతా ప్రమాణాలేవీ?

Thalaivar 173: రజనీకాంత్ ‘తలైవార్ 173’ కి దర్శకుడు ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Bandi Sanjay: అబద్ధాల పోటీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కే అవార్డులు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!