Gadwal ( image credit: swetha reporter)
నార్త్ తెలంగాణ

Gadwal: గద్వాల గోనుపాడులో వెంచర్‌ స్థలం కబ్జా.. మాజీ నాయకుడే అనుమతిచ్చాడు అంటూ వ్యాపారి

Gadwal: గద్వాల మండలం గోనుపాడు శివారులో గద్వాలకు చెందిన కొంతమంది వ్యాపారస్తులు పొలాన్ని తీసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంచర్ చేశారు.‌ అందులో ఎక్కువ శాతం ప్లాట్ లు కూడ అమ్మేశారు. అయితే ఆ వెంచర్ లో పదిశాతం స్థలాన్ని గ్రామపంచాయతీకి వదలడం జరిగింది.ఆ వదిలిన స్థలం ఖాళీగానే ఉందని ఆ వెంచర్ లో ప్లాట్ తీసుకున్న ఓ వ్యక్తి పదిశాతం స్థలంలో దర్జాగా గుడిసె వేసుకుని జీవనం(ఏదో వ్యాపారం పెట్టుకున్నట్టున్నాడు కొనసాగిస్తున్నాడు. ఇది పదిశాతం స్థలం కదా ఇందులో గుడిసె వేయకూడదు కదా అంటే ఓ‌ మాజీ ప్రజాప్రతినిధి వేసుకోమన్నాడు,వేశాను అంటూ సమాధానం ఇచ్చాడు.

Also ReadJogulamba Gadwal: జోరుగా అక్రమ ఇసుక రవాణా.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

ఈ వెంచర్ ఆయనదే

అలా ఎలా వేసుకోమని చెబుతారు అని అడగగా ఈ వెంచర్ ఆయనదే, ఆయన్నే అడిగి వేసుకున్న అంటూ బదులిచ్చాడు. వెంచర్ లో మద్యం సేవిస్తారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు పలుమార్లు 100 కి ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు, అధికారులకు చెబితే పట్టించుకోరు కానీ నేను గుడిసె వేస్తే వచ్చి అడుగుతున్నారబ్బా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నాడని సమాచారం. కాగ వెంచర్ లో ఎలక్ట్రికల్ కు సంబంధించిన ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ కూడ పదిశాతం స్థలం కబ్జా చేసిన అతను పెట్టుకున్నాడట. సమాచారం నిమిత్తం సంబంధిత శాఖ అధికారులను అడగగా అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండ పని చేస్తున్నారని తెలిసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా అధికారులు అందుబాటులోకి రాలేదు.

ఆయన నాకెవరో కూడ తెల్వదు-ఓ‌ మాజీ ప్రజాప్రతినిధి

గద్వాల మండలం గోనుపాడు నందు వేసిన వెంచర్ లో నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా భాగం కలిసిన మాట వాస్తవమే కానీ అందులో పదిశాతం స్థలం ఎక్కడుందో, ప్లాట్ లు ఎవరెవరు తీసుకున్నారో నాకైతే తెల్వదని అన్నారు. పదిశాతం స్థలంలో ఎవరు గుడిసె వేసింది కూడ తనకు తెల్వదని, నేనెవరికీ కబ్జా చేసి పెట్టుకోండి అంటూ చెప్పలేదని ఆయన అన్నారు.

Also Read: Jogulamba Gadwal: ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు.. పరామర్శించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు

Just In

01

SSMB29 title glimpse event: ఏం డెడికేషన్ భయ్యా టైటిల్ గ్లింప్స్ కోసం లెక్చరర్ గా మారిన రాజమౌళి.. వీడియో వైరల్..

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎక్కడ?.. బీహార్ ఫలితాలపై ఇంకా స్పందించని వైనం

Pushpa 3: అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదే.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

Kunamneni Sambasiva Rao: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ విజయంపై.. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

Modi on Bihar Verdict: బీహార్‌లో ఎన్డీయే గెలుపునకు ప్రధాని మోదీ చెప్పిన కారణాలు ఇవే