GHMC ( image credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: మెడికల్ ఆఫీసర్ల అక్రమాలకు చెక్.. బల్దియాలో కీలక సంస్కరణలకు కమిషనర్ సిద్ధం

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో సుమారు కోటి మందికి పైగా జనాభాకు అత్యవసర పౌర సేవలు అందించే మెడికల్ ఆఫీసర్ల (Medical Officers) అక్రమార్జనకు అడ్డుకట్ట వేయడానికి ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. సర్కిళ్ల స్థాయిలో పనిచేసే ఈ మెడికల్ ఆఫీసర్లు నిర్వర్తించే ప్రతి విధిలోనూ అవినీతి ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, వారిని కేవలం ఆరోగ్య కార్యకలాపాలకే పరిమితం చేయాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ భావిస్తున్నట్లు తెలిసింది. స్టేట్ మెడికల్, హెల్త్ విభాగం నుంచి జీహెచ్ఎంసీ (GHMC)లోకి డిప్యూటేషన్లపై వచ్చే ఈ మెడికల్ ఆఫీసర్లు తమ వృత్తికి విరుద్ధమైన విధులు నిర్వహిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో వీరు పారిశుద్ధ్య పనులు, బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ, శానిటేషన్ కార్మికుల అటెండెన్స్ వంటి పనులను పర్యవేక్షించేవారు. కొందరు మెడికల్ ఆఫీసర్లు ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేసి జైలుకెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి.

Also ReadGHMC: 226 పోస్టుల భర్తీ కోసం సర్కారుకు ప్రతిపాదన..పెరుగుతున్న పనిభారంతో ప్లానింగ్ వింగ్ పరేషాన్!

ట్రేడ్ లైసెన్స్ పవర్ కట్

కమిషనర్‌గా కర్ణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మెడికల్ ఆఫీసర్ల విధి నిర్వహణపై నిఘా పెంచారు. క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించని కొందరు ఆఫీసర్లకు శానిటేషన్ పనుల బాధ్యతలను కట్ చేశారు. గతంలో మెడికల్ ఆఫీసర్లకే ట్రేడ్ లైసెన్సుల జారీ అధికారం ఉండేది. దీనిని అడ్డం పెట్టుకుని వారు, వారి కింది స్థాయి సిబ్బంది యజమానులతో బేరాలు కుదుర్చుకుని తక్కువ ఫీజులు విధిస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేవారు. ఈ ఘటనలు వెలుగుచూడటంతో, కమిషనర్ కర్ణన్ కొన్ని సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్లకు ట్రేడ్ లైసెన్స్ ల జారీ అధికారాన్ని కూడా తొలగించారు. వృత్తిరీత్యా వైద్యులైనందున, ఈ మెడికల్ ఆఫీసర్ల సేవలను కేవలం హెల్త్ విభాగానికి మాత్రమే పరిమితం చేయాలని కమిషనర్ భావిస్తున్నారు. సర్కిళ్ల వారీగా వీరు తమ ఏరియాల్లో పర్యటిస్తూ వ్యాధి నివారణ చర్యలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ వంటి అంశాలపై మాత్రమే విధులు నిర్వర్తించాలని త్వరలోనే అధికారికంగా ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

డిప్యూటేషన్ గడువు ముగిసినా

స్టేట్ మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి జీహెచ్ఎంసీకి మెడికల్ ఆఫీసర్లుగా వచ్చే డాక్టర్లు అక్రమ సంపాదనకు అలవాటు పడి, డిప్యూటేషన్ గడువు ముగిసినా సీట్లను వదలడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఆరుగురు మెడికల్ ఆఫీసర్లు గడువు ముగిసిన తర్వాత కూడా పైరవీలు చేసుకుని జీహెచ్ఎంసీలోనే కొనసాగారు. ఇక్కడి అక్రమ సంపాదనకు అలవాటు పడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మెడికల్ ఆఫీసర్ కూడా ఖైరతాబాద్ జోన్‌లో అనధికారికంగా తిష్ట వేశాడనే చర్చ జోరుగానే ఉంది.

Also Read: GHMC: ఫుటోవర్ బ్రిడ్జిలపై అధ్యయనం.. స్టడీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశం

Just In

01

Nara Lokesh: గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్.. రూ.82,000 కోట్ల భారీ పెట్టుబడి.. రెన్యూ పవర్ వచ్చేస్తోంది!

Cold Wave: తెలంగాణలో తీవ్రమైన చలి.. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు

Jogipet Robbery: జోగిపేటలో రెండు దుకాణాల్లో చోరీ.. రూ.3.5 లక్షల విలువైన ఫోన్లు దొంగతనం

Gadwal District: ధాన్యంపై అక్రమార్కుల కన్ను.. నిర్వాహకులతో చేతులు కలుపుతున్న మిల్లర్లు

Gold Price Today: మహిళలకు బిగ్ షాక్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?