Kunamneni Sambasiva Rao: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు భారీ బహిరంగ సభ చరిత్రలో మరో వంద సంవత్సరాలు నిల్చుండే పోయేలా నిర్వహించాలని, అందుకుఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నాయకులు సర్వం ధారబోసి శ్రమించి పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పిలుపు ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా సిపిఐ కార్యాలయంలో న సిపిఐ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమితి సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
Also Read: Kunamneni Sambasiva Rao: ఆ రెండు పార్టీలు గెలిస్తే చాలా డేంజర్: ఎమ్మెల్యే కూనంనేని
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారత దేశ రాజకీయ చరిత్రలో 100 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన మరి ఏ పార్టీ లేదని, కేవలం సిపిఐకే ఆ ఘనత దక్కుతుందని గుర్తు చేశారు. ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర భారత దేశంలో విలీనం చేసిన తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ఇప్పుడున్న భారతదేశాన్ని నిర్మించుకోవడానికి వంద సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు నిర్వహించిందని అన్నారు.
జైలు జీవితం వేలాదిమంది అజ్ఞాన జీవితం
వందేళ్ల పోరాట చరిత్రలో వేలాదిమంది ప్రాణార్పణాలు అక్షరాభిముంది జైలు జీవితం వేలాదిమంది అజ్ఞాన జీవితం సాంబశివరావు అన్నారు దేశంలోని ప్రజలందరూ అసమానతలు లేని ప్రజలంతా ఒకటేనని సుఖశాంతులతో జీవించే సోషలిజం సమ సమాజమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమన్నారు. దేశంలో రాష్ట్రంలో ఆర్థిక కులమతాలు ప్రజల మధ్య విభజన రేఖలు గీస్తున్నాయని అవి రూపుమారే వరకు సీపిఐ ఉద్యమాలు నిర్మిస్తూనే ఉంటుంది అన్నారు.
పార్టీ నాయకులందరూ శ్రమించాలి
సీపీఐ వందేళ్ల ఉత్సవాన్ని తమ సొంత కుటుంబ కార్యక్రమంలా పార్టీ నాయకులందరూ శ్రమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జీ, జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి బాలకిషన్, గద్వాల జిల్లా కార్యదర్శి అంజనేయులు, వనపర్తి జిల్లా కార్యదర్శి విజయ రాములు, నారాయణపేట జిల్లా కార్యదర్శి నరసింహ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే కేశవులు గౌడ్, వార్ల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kunamneni Sambasiva Rao: ప్రజాస్వామ్యానికి పునాదులు అవే.. సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు
