Nizamabad( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Nizamabad: మానవత్వం చాటుకున్న ఇందూరు యువత.. రెండు అనాథ శవాలకు అంత్యక్రియలు!

Nizamabad: మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ, గుర్తు తెలియని ఇద్దరు అనాథ మృతదేహాలకు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన రెండు మృతదేహాలు ఎవరూ గుర్తించకపోవడంతో ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. ఈ మృతులు రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉండగా, పోలీసులు వారిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ వారు తుదిశ్వాస విడిచారు. వారికి సంబంధించిన గుర్తింపు (ఐడెంటిటీ) గానీ, బంధువులు గానీ లేకపోవడంతో, అంత్యక్రియల బాధ్యతను ఎవరూ తీసుకోలేదు.

Also Read: Nizamabad MLA PA: ఆ జిల్లాలో నోటీసుల కలకలం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే పీఏగా చేయడం ఏంటి?

సేవా సంస్థ చొరవ

ఈ పరిస్థితిని గమనించిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆ బాధ్యతను స్వీకరించింది. నిజామాబాద్ 1వ ఠాణా పోలీసు సిబ్బంది, కామారెడ్డి పోలీసు సిబ్బంది అనుమతితో, మంగళవారం ఆ రెండు అనాథ శవాలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ గొప్ప కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, నరేశ్ రెడ్డి, 1వ ఠాణా పోలీసు సిబ్బంది తరఫున రాజ్‌గోపాల్, కామారెడ్డి పోలీసు సిబ్బంది తరఫున విజయ్ తదితరులు పాల్గొన్నారు. వారి మానవతా దృక్పథాన్ని పలువురు ప్రశంసించారు.

Also ReadNizamabad Crime: తల్లి కోసమే హత్య? కారు డిక్కీ డెడ్ బాడీ కేసులో సంచలన నిజాలు..

Just In

01

Huzurabad: కాలేజీ ఒకచోట, పరీక్షలు ఇంకోచోట.. వాగ్దేవి కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల అయోమయం!

Kunamneni Sambasiva Rao: సిపిఐ శతాబ్ది ఉత్సవాలు వంద సంవత్సరాలు గుర్తుండేలా నిర్వహించాలి : ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు

Bigg Boss Telugu 9: కింగ్, క్వీన్స్.. నన్ను తొక్కి నువ్వు లేవకు.. దివ్యపై రీతూ ఫైర్!

Jupally Krishna Rao: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Telangana Police: డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై పోలీసు సంఘం సీరియస్