Delhi Blast Suspects (Image Source: Twitter)
జాతీయం

Delhi Blast Suspects: టార్గెట్ దీపావళి.. ఆపై జనవరి 26కు ఛేంజ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Delhi Blast Suspects: దిల్లీ పేలుడు ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులు.. సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రధాన నిందితుడు (Key suspect) భావిస్తున్న ముజామ్మిల్ (Muzammil) దర్యాప్తు వర్గాలు ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. పేలుడులో ప్రత్యక్షంగా భాగమైన ఉమర్ తో తాను మాట్లాడీనట్లు నిందితుడు అంగీకరించాడు. పేలుడు ముందు ఎర్రకోట ప్రాంతం మెుత్తాన్ని పరిశీలించాలని తాను చెప్పినట్లు పేర్కొన్నారు.

టార్గెట్.. జనవరి 26

దిల్లీలో జనవరి 26న పేలుళ్లకు తెగబడాలని తాము ప్లాన్ చేసినట్లు ముజామ్మిల్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎర్రకోట పరిసర ప్రాంతాలను పరిశీలించాలని ఉమర్ కు చెప్పినట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో దీపావళికి కూడా జనసంచారం అధికంగా ఉంటుందని తాము అంచనా వేసినట్లు పేర్కొన్నారు. కాబట్టి దీపావళికి జనసంచారం ఎక్కువ ఉన్న ఏరియాల్లో దాడులు జరపాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. కానీ దానిని అమలు చేయలేకపోయినట్లు దర్యాప్తు అధికారులకు ముజామ్మిల్ చెప్పాడు. దీంతో రిపబ్లిక్ డేను టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో ఎర్రకోట వద్ద ఉమర్ రెక్కీ నిర్వహించినట్లు కూడా ముజామ్మిల్ అంగీకరించాడు.

ముజామ్మిల్‌కు సహచరుడు

ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగిన పలువురు వైద్యులను దర్యాప్తు సంస్థలు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫరిదాబాద్ లో వారిని అదుపులోకి తీసుకోగా అందులో ముజామ్మిల్ కూడా ఉన్నాడు. అయితే దిల్లీలో బాంబు పేలుడుకు కారణమైన ఉమర్.. ముజామ్మిల్ కు సహచరుడిగా దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద  నెమ్మదిగా కదులుతున్న కారులో ఒక్కసారిగా ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. పదులు సంఖ్యలో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.  అయితే పేలుడు కారణమైన కారులో ఉమర్ ప్రయాణించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ పేలుడులో ఉమర్ కూడా చనిపోయినట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.

Also Read: Jubilee Hills By Election exit poll: జూబ్లీహిల్స్ బైపోల్స్.. మ్యాజిక్ చేసిన సీఎం రేవంత్.. ప్రతీ వ్యూహం సూపర్ హిట్!

దిల్లీ పేలుడు వెనుక..

మరోవైపు దిల్లీ పేలుడు వెనుక విద్యావంతులైన వైద్య నిపుణుల సమూహం ఉన్నట్లు తేలింది. వీరిలో చాలా మంది ఫరిదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. జమ్ముకాశ్మీర్ ఈ నెట్ వర్క్ ను వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ (White Collar Terror Ecosystem) గా పేరు పెట్టారు. వీరంతా పాక్ కు చెందిన ఇస్లామిక్ స్టేట్ (ISIS) ప్రేరణతో ఈ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది.

Also Read: Delhi Blast: పేలుడుకు ముందు 3 రోజులపాటు అండర్‌గ్రౌండ్‌లోకి ఉమర్.. వెలుగులోకి సంచలన నిజాలు

Just In

01

Chiranjeevi in Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ కామియోపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి.. కానీ చిరుతో..

Vakiti Srihari: మత్స్య కారుల అభివృద్ధికి కృషి.. రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించాం.. మంత్రి వాకిటి శ్రీహరి

Tollywood movie budget: టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం బడ్జెట్ పెరుగుతూ వస్తుంది.. దీనికి కారణం ఏంటంటే?

Al Falah University: ఉగ్రవాదులకు అడ్డా అంటూ ఆరోపణలు.. స్పందించిన అల్‌-ఫలాహ్‌ యూనివర్శిటీ

Movie budget: సినిమాలకు పెట్టిన బడ్జెట్ నిజంగా అంత అవుతుందా.. ఎందుకు అలా చెప్తారు?