Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ మాస్ పబ్లిక్ లోని మెజార్టీ లంతా కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రతీ పది మందిలో 7 గురు నవీన్ అభ్యర్ధిత్వంపై పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. పార్టీ కంటే వ్యక్తిగత గుర్తింపుతోనే అత్యధిక మంది నవీన్ అభ్యర్ధిత్వానికి పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు సమాచారం. జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంలో ఓటేసిన బస్తీలు, కాలనీ ల ప్రజలు, షాపులు, ఆటోడ్రైవర్లు, పండ్ల బండ్లు,మెకానిక్, డైలీ కార్మికులంతా నవీన్ కే సపోర్టు చేసినట్లు నేరుగానే ప్రకటించారు. పలు సర్వే సంస్థలు, పార్టీ అభ్యర్దులు చేసిన స్టడీలో వీరంతా తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచినట్లు తెలిసింది. కాస్ట్ లీ కాలనీలతో పోల్చితే బస్తీ జన వాసులే ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్ధి వైపు నిలబడ్డట్లు తెలుస్తోంది. వాస్తవానికి నవీన్ యాదవ్ గత కొన్ని ఏళ్లుగా ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి బస్తీలు, కాలనీల్లో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదలకు ఆపద వస్తే తన ఫౌండేషన్ తరపున సహయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ సేవే సపోర్టుగా నిలిచిందంటూ నవీన్ ఫాలోవర్స్ చెబుతున్నారు.
Also Read: Jubilee Hills Voters: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది ఓటర్ల జాబితా విడుదల.. మెుత్తం ఓటర్లు ఎంతమందంటే?
సైలెంట్ ఓటర్లు సస్పెన్స్?
పోలింగ్ తర్వాత కొంత మంది తమ అభిప్రాయాలు వ్యక్త పరచగా, మరి కొంత మంది సైలెంట్ గానే ఉన్నారు. అన్ని డివిజన్లలోనూ ఈ ట్రెండ్ కనిపించింది. అయితే ఈ సైలెంట్ ఓటర్లు ఎవరి వైపు నిలబడ్డారనేది? ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పార్టీల అంచనాలకు ఛే చిక్కకుండా ఆ ఓటర్ల తీరు కనిపించినట్లు పోలింగ్ బూత్ లను గమనిస్తే అర్థమవుతుంది. ఈ ట్రెండ్ ను కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా క్లెయిమ్ చేసుకుంటుంది. ప్రభుత్వ పనితీరుతో ఆ సైలెంట్ ఓటర్లు తమ వైపు ఉంటారని కాంగ్రెస్ లీడర్లు చెప్తుండగా, వాళ్లంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంటూ బీఆర్ ఎస్ తన ఖాతాలో వేసుకుంటుంది . కానీ ఆ ఓటర్ల మనోగతం ఈ నెల 14 న బయట పడనున్నది. ప్రతీ పార్టీకి సహజంగానే కొంత శాతం ఫిక్స్ డ్ ఓట్లు ఉంటాయి. మరి కొంత ప్రభావితం, సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. కానీ సైలెంట్ ఓటు బ్యాంక్ మాత్రం అత్యధికంగా ఓ పార్టీకే మాత్రమే పడే ఛాన్స్ ఉంటుందనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ ట్రెండ్ ఎప్పట్నుంచో కొనసాగుతూ వస్తున్నట్లు వారు వివరిస్తున్నారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే సైలెంట్ ఓటు బ్యాంక్ సపోర్టుపై క్లారిటీ రానున్నది.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తాజా సర్వే.. రెండు పార్టీల మధ్య ఎంత శాతం తేడానో తెలుసా?
కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కంటే…?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ కంటే నవీన్ సొంత ఇమేజ్ ను పసిగట్టింది. టిక్కెట్ సెలక్షన్ లో ఏకంగా మూడు సర్వేలు నిర్వహించింది. ఇందులో అభ్యర్ధి, పార్టీ పేరిట వేర్వేరుగా సర్వేలు చేశారు. అన్ని సర్వేల్లోనూ పార్టీ మైలేజ్ కంటే నవీన్ అభ్యర్ధిత్వానికి ఎక్కువ శాతం పాయింట్లు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐసీసీ కూడా టిక్కెట్ ను ఫైనల్ చేసింది. ఇక ఎన్నికల ట్రెండ్ , పబ్లిక్ పల్స్ ను తనదైన శైలీలో పసిగట్టగల సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదట్నుంచి నవీన్ యాదవ్ అభ్యర్ధిత్వానికే మొగ్గు చూపుతూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి అంచనాలను స్పష్టంగా గుర్తించిన హైకమాండ్..ఈ ఉప ఎన్నికల అభ్యర్ధి ఎంపికలోనూ సీఎం ఓపీనియన్ కు ప్రయారిటీ ఇచ్చింది. పోలింగ్ తర్వాత బూత్ ల వద్ద పబ్లిక్ అభిప్రాయాలు ఈ అంచనాలకు సరితూగాయని స్పష్టంగా చెప్పవచ్చు.
Also Read:Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి
