Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల మధ్య గ్యాప్ 6 శాతం ఉన్నట్లు సర్వేల్లో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థికి 44 శాతం మద్దతు లభించగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 38 శాతం మంది ప్రజలు సపోర్ట్ చేసినట్లు లోక్ పాల్ సంస్థ తన సర్వేలో తెలిపింది. బీజేపీ కేవలం 15 శాతం మంది మద్దతును మాత్రమే పొందినట్లు పేర్కొన్నది. మరో 3 శాతం ఇతరులకు లభించినట్లు లోక్ పాల్సంస్థ స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ కేటగిరీల వారీగా సుమారు 3,100 శాంపి ళ్లపై అధ్యయనం చేసిన ఈ సంస్థ. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది.
Also Read: Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ
అధికార పార్టీ వైపు మొగ్గు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, డివిజన్ల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తాయనే విషయా న్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్థానికంగా బలమైన యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను బరిలో నిలపడం విజయావకాశాలను మరింత మెరుగు పరిచినట్లు వివరించింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే యువ నాయకుడిగా ఆయనకు ఆదరణ ఉన్నట్లు సర్వే సంస్థ గుర్తించింది. అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం వల్ల స్థానిక అవసరాలు, అభివృద్ధి పనులు జరుగుతాయన్న ప్రజల భావన కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అని లోక్ పాల్ సర్వే వివరించింది. దీంతో పాటు ఎంఐఎం మద్దతు, హెచ్వైసీ సల్మాన్ ఖాన్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడం మై నారిటీల్లో కాంగ్రెస్ బలాన్ని పెంచిందని క్షే ఈస్థాయి పరిస్థితులను వివరించింది. దీనికి తోడుగా మైనారిటీ సంఘాల నాయకులు, మత పెద్దల మద్దతును కూడగట్టడం కాంగ్రెస్‌కు మేలు చేయనున్నదని వెల్లడించింది.
పట్టు కోల్పోయిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మహిళ చుట్టూ రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్, క్షేత్ర స్థాయిలో పట్టు కోల్పోతున్నదని కాంగ్రెస్ చెబుతున్నది. అంతేకాకుండా గత పదేళ్లలో జూబ్లీహిల్స్పై బీఆర్ఎస్ ప్రదర్శించిన నిర్లక్ష్యం ఆ పార్టీ విజయావ కాశాలను దెబ్బ తీసిందని వివరిస్తున్నది. అటు బీజేపీ హిందూత్వ రాజకీయాలు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును దెబ్బ తీయవ చ్చని అంచనా వేస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేననే భావన కూడా మైనార్టీ ఓటర్లలో ఉన్నదని, జూబ్లీహిల్స్ మెజార్టీ ఓటర్లు వారే కావడంతో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్‌కే వస్తుందనే ధీమాతో ఆ పార్టీ లీడర్లు ఉన్నారు. లోక్ పాల్ సంస్థ కూడా ఇదే విషయాన్ని పసిగట్టింది. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ పాల్ విడుదల చేసిన సర్వే వాస్తవ పరిస్థితులను అద్దం పట్టింది. తాజాగా జూ బ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ సంస్థ విడుదల చేసిన సర్వే అధికార పార్టీకి పోలింగ్కు ముందు బూస్ట్ ఇచ్చినట్టైంది.
సీఎం, మంత్రుల ప్రచారం మరింత ప్లస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం. మంత్రుల ప్రచారం మరింత మైలేజ్ అయ్యేలా ఉన్నది. ప్రతి పక్షాలపై సంధిస్తున్న విమర్శనాస్త్రాల తో పాటు సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం కల్పిస్తున్న భరోసాతో ప్రజలు కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్నారు. రోజురోజుకు గ్రాఫ్ పెరుగుతున్నదని సర్వే సంస్థ కూడా చెబుతున్నది. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సం బంధించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటి అమలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు నియో జకవర్గ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. సీఎం ప్రచారం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి అజెండాను, హామీలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నది. ప్రతీ రోజు డివిజన్ల వారీగా కార్నర్ మీటింగులు, ర్యాలీలు, సభల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం తన వ్యూహాన్ని అమలు చేయనున్నారు.
