Jubilee Hills Bypoll (imagecredit:twitter)
Politics, హైదరాబాద్

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లోని ఇన్‌ఛార్జ్ మంత్రులపై డబ్బుల ఒత్తిడి పెరుగుతున్నది. క్షేత్రస్థాయి లీడర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటున్నట్టు తెలిసింది. అన్ని డివిజన్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని ఓ మంత్రి తెలిపారు. పోలింగ్‌కు వారం రోజుల ముందే గ్రౌండ్ లెవల్ టీమ్స్ నుంచి మనీ ప్రెజర్ వచ్చినట్లు ఆయన ఆఫ్​ ది రికార్డులో వివరించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో ఖర్చు పెట్టలేరా అని కొందరు డివిజన్ స్థాయి లీడర్లు నేరుగానే అడుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ డివిజన్ల వారీగా భారీగా డబ్బులు పంచుతున్నదని, వాళ్ల కంటే ఎక్కువ పంచాలంటూ క్షేత్రస్థాయి లీడర్లు మంత్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

సీనియర్ మంత్రి సీరియస్

కొన్ని రోజులుగా ఉదయం ప్రచారం మొదలు కాకముందే ఆయా ఇన్‌ఛార్జ్ మంత్రుల ఇళ్ల దగ్గర జూబ్లీహిల్స్‌లోని డివిజన్ స్థాయి లీడర్లు హడావుడి చేస్తున్నారు. పేపర్లలో లెక్కలు వేసి మరీ ఇన్ని పంచాలి, అన్ని ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసి అడుగుతున్నట్టు తెలిసింది. ఈ విధానంపై ఒకరిద్దరు సీనియర్ మంత్రులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ విజయం కోసం పని చేసినట్లు లేదని, కేవలం డబ్బు పంపిణీ కోసం మీరు తిరుగుతున్నట్టు ఉన్నదంటూ ఓ మంత్రి ఆయా క్షేత్రస్థాయి లీడర్లకు చురకలు అంటించినట్లు తెలిసింది. అయితే, పార్టీ అభ్యర్థి డివిజన్ల వారీగా తన ప్రచారంతో పాటు క్షేత్రస్థాయి లీడర్లతో అన్ని రకాలుగా సమన్వయమై వెళ్తున్నా, మంత్రులపై డబ్బుల ప్రెజర్ పడడం హాట్ టాపిక్ అయింది.

Also Read: Polavaram Project: నీటి కేటాయింపులు మా పని కాదు.. స్పష్టం చేసిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ

ఎమ్మెల్యేలపై కూడా?

పార్టీ ఆదేశాల మేరకు కొంతమంది ఎమ్మెల్యేలు డివిజన్ల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కూడా స్థానికంగా ఉండే లీడర్లు మనీ ప్రపోజల్స్ పెడుతున్నట్టు తెలిసింది. పైగా ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేలు డబ్బులు ఇవ్వడం లేదని కొందరు నేరుగా ఇన్‌ఛార్జ్ మంత్రులకు ఫోన్లు చేస్తున్నారట. దీంతో వారితో పాటు ఎమ్మెల్యేలూ అవాక్కవుతున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా లీడర్ల నుంచి మరింత డిమాండ్ వస్తున్నదని ఓ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్​హం. ఇవాళ్టితో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముగియనున్నది. దీంతో ఆయా లీడర్ల నుంచి ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉండే ఛాన్స్ ఉన్నట్లు కాంగ్రెస్ లీడర్లే చెబుతున్నారు. కొంత మంది అయితే ప్రచారం ముగిసిన తర్వాత మనీ పంచలేమని, అందుకే ఇప్పుడే అడుగుతున్నామని చెబుతున్నారట. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్​ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో డబ్బు పంపిణీకి డిమాండ్ పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనున్నది. దీంతో పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెంచాలని టీపీసీసీ ఆదేశాలిచ్చింది. రెండు రోజుల పాటు దీనిపైనే పర్యవేక్షించనున్నారు. వంద ఇళ్లకు ఓ కో ఆర్డినేటర్ చొప్పున పని చేయాల్సిన అవసరం ఉన్నట్టు పార్టీ సూచించింది. ఓటు అభ్యర్థించడంతో పాటు పోలింగ్ ముందు వరకు ఆయా ఓటర్లను దగ్గరుండి మరీ తీసుకువెళ్లాలని పార్టీ పేర్కొన్నది. ఇక పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ ఏజెంట్లూ అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలిచ్చారు. పోలింగ్ డే నుంచి కౌంటింగ్ ముగిసే వరకు అలర్ట్‌గా ఉండాలన్నారు. అనుమానిత వ్యక్తులను గుర్తు పట్టి ఆఫీసర్లకు అప్పగించే బాధ్యతలు కూడా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ విజయం సాధించే ఛాన్స్ ఉన్నందున ప్రత్యర్థి పార్టీలు అలజడి సృష్టించే అవకాశాలూ ఉన్నట్లు పీసీసీ చీఫ్​ అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: Samantha: ఏదో ఒకటి తేల్చేయవచ్చుగా… ఎందుకీ దాగుడుమూతలు?

Just In

01

Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!

Jubilee Hills Bypoll: మూగబోయిన మైక్‌లు.. జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్రచారపర్వం

Temple hundi fire: కానుకలు వేసే హుండీలో కర్పూరం వేసింది.. ఓ భక్తురాలి అత్యుత్సాహం

Bandi Sanjay: ఆయన తండ్రే ఎం చేయలేక పోయిండు కొడుకు ఎం చేస్తాడు: బండి సంజయ్

Student death In US: ఛాతిలో నొప్పిని విస్మరించి.. అమెరికాలో ఏపీ యువతి మృతి