Jubilee Hills Voters (Image Source: Twitter)
తెలంగాణ

Jubilee Hills Voters: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది ఓటర్ల జాబితా విడుదల.. మెుత్తం ఓటర్లు ఎంతమందంటే?

Jubilee Hills Voters: రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సుధర్శన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది.

యువకులు, వృద్ధుల లిస్ట్

జూబ్లీ హిల్స్ ఓటర్ల జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18-19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు ఉన్నారు. మరో 95 మంది ఓటర్లు విదేశాల్లో జీవిస్తున్నట్లుగా జాబితాలో పేర్కొన్నారు.

కొత్తగా 6,976 మంది చేరిక

అంతకుముందు ఈనెల 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు. 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

పరిశీలకుల నియామకం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఆదివారం కేంద్ర పరిశీలకులను నియమించింది. దేశవ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 8 రాష్ట్రాల్లో ఉపఎన్నికల కోసం మొత్తం 470 మంది సీనియర్ అధికారులను నియమించినట్టు కమిషన్ ప్రకటించింది. ఈ పరిశీలకుల్లో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్‌ఎస్, ఐఆర్‌ఏఎస్, ఐసీఏఎస్ తదితర సేవలకు చెందిన అధికారులను కమిషన్ నియమించింది. ఈ అధికారులంతా ఎన్నికల ప్రక్రియలో న్యాయం, పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తారని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Also Read: Tilak Varma: హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి.. పాక్‌పై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌పై.. ఆసక్తికర వ్యాఖ్యలు

జిల్లా ఎన్నికల అధికారి కసరత్తు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (JubileeHills bypoll) కోసం నియమించిన నోడల్ అధికారులంతా సిద్దం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ శనివారం ఆదేశించారు. పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తటస్థంగా వ్యవహరిస్తూ నిబంధనలకు లోబడి, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పని చేయాలన్నారు. ఈ మేరకు శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో కర్ణన్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నోడల్ అధికారుల సన్నద్ధతను ఆయన సమీక్షించారు. ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.

Also Read: India vs Pakistan: టీమిండియా తొండి చేసింది.. ఎవరూ ఆ జట్టుతో ఆడొద్దు.. పాక్ మాజీ ఆటగాడి పిలుపు

Just In

01

Mahakali: ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా ఎవరంటే?

Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!

Rajasthan Bride: శోభనం రోజున వరుడికి బిగ్ షాక్.. వధువు దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ఏమైందంటే?

H1B Visa Fee: హెచ్-1బీ ఫీజు పెంచిన ట్రంప్‌కి షాక్.. భారత్‌కు వచ్చే యోచనలో అమెరికా కంపెనీలు!

Kodama Simham: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కౌబాయ్ మూవీ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్!