Huzurabad ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Huzurabad: జాతీయస్థాయి కరాటే పోటీల్లో.. హుజూరాబాద్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన!

Huzurabad: గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా, కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ పర్యవేక్షణలో కరాటే శిక్షణ పొందుతున్న హుజూరాబాద్ పట్టణానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో మెరిశారు. కాజీపేటలోని ఏజీఆర్ గార్డెన్స్ లో శోటోకాన్ కరాటే డు అకాడమీ నిర్వహించిన ‘నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్’ పోటీలలో వీరు పాల్గొన్నారు. ఈ పోటీలలో హుజూరాబాద్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో 6 గోల్డ్ మెడల్స్ మరియు ఒక సిల్వర్ మెడల్ సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. విజేతలకు ఘన సన్మానం విజయం సాధించిన విద్యార్థులకు హుజూరాబాద్‌లోని న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ విద్యార్థులను ఘనంగా సన్మానించి సర్టిఫికెట్లను అందజేశారు.

Also Read: Huzurabad: బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం.. డీబీఎల్ కంపెనీపై సింగపూర్ రైతుల ఆగ్రహం!

ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… మాస్టర్ జలీల్ కృషితో విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడంపై హర్షం వ్యక్తం చేశారు. కరాటే విద్యతో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని, క్రమశిక్షణతో కూడిన భావి పౌరులుగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలలో ఆత్మస్థైర్యం, ధైర్యం పెంపొందించడానికి కరాటే ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ గణేష్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ డైరెక్టర్ గోపాల్, మహాత్మ జ్యోతిరావు పూలే మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఎండీ ఖలీద్ హుస్సేన్, గోస్కుల మధు, గోస్కుల నాగమణి, మైనార్టీ నాయకులు ఎండీ తౌసిక్ పాల్గొన్నారు.

విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలి: యూత్ కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

జమ్మికుంట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో పౌష్టికాహార పంపిణీపై యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళ వారం పాఠశాలను మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంఈఓలతో కలిసి పర్యవేక్షించిన యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో అలసత్వం వహించవద్దని అధికారులను హెచ్చరించారు.

Also ReadHuzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు.. డాక్టర్ కృష్ణ ప్రసాద్ పిలుపు

ప్రభుత్వం వెనకాడదని స్పష్టం

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెల్లి నాగరాజు, జిల్లా కార్యదర్శి సజ్జుతో కలిసి ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వ చర్యలు తప్పవని, వారిని విధుల్లోంచి తొలగించేందుకు ప్రభుత్వం వెనకాడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి విద్య అందించేందుకు, డైట్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు కొందరి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అప్రతిష్టపాలు కాకూడదని, బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ పట్టణ అధ్యక్షులు బండి పవన్ సహా పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Also Read: H-1B visa: ట్రంప్ మరో బాంబ్.. హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లు.. భారత్‌పై ప్రభావమెంత?

Just In

01

Kunamneni Sambasiva Rao: పేద ధనిక అంతరాలను తొలగించే ఏకైక మార్గం సోషలిజమే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Bihar Exit Polls: బీహార్‌‌లో మళ్లీ ఎన్డీయే!.. ఘంటాపథంగా చెబుతున్న ఎగ్జిట్ పోల్స్.. సీట్ల అంచనాలు ఇవే

Bigg Boss Promo: గెలుపు నిర్ణయంలో మహారాజుపై ఫైర్ అవుతున్న తనూజా.. ఏం కిక్ ఉంది మామా..

Thummala Nageswara Rao: ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలువాలి.. అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల

Dharmapuri Arvind: కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదు : ఎంపీ అరవింద్