Huzurabad: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా డీబీఎల్ కంపెనీ సింగపూర్ చెరువు మత్తడి వద్ద శాశ్వత బ్రిడ్జిని నిర్మించలేదు. దీంతో చెరువు పొంగి వచ్చిన నీరు సక్రమంగా పోక, పొలాలకు బ్యాక్ వాటర్ చేరి పంట పూర్తిగా మునిగిపోయింది. పంట నష్టం లక్షల రూపాయల్లో ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అధికారుల వైఫల్యంపై మండిపాటు
సింగిల్ విండో అధ్యక్షులు కౌరు సుగుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, “బ్రిడ్జి నిర్మాణ ఆవశ్యకత గురించి జాతీయ రహదారుల డైరెక్టర్ కృష్ణారెడ్డికి, ఇరిగేషన్ అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఇరిగేషన్, డీబీఎల్ కంపెనీల ఉమ్మడి నిర్లక్ష్యం వల్లే రైతులు నేడు తీవ్రంగా నష్టపోయాము. ఇది మాకు తీరని అన్యాయం” అని మండిపడ్డారు.
సీఐ హామీతో శాంతించిన రైతులు
దీర్ఘకాలం సాగిన రాస్తారోకో కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో, హుజూరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులను శాంతింపజేసి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఐ హామీ మేరకు రైతులు తమ నిరసనను విరమించారు, దీంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా కౌరు సుగుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టాన్ని వెంటనే పరిశీలించి రైతులకు తగిన పరిహారం చెల్లించాలి. నేషనల్ హైవే కాంట్రాక్టర్ డీబీఎల్ కంపెనీ సింగపూర్ చెరువు ప్రాంతంలో తక్షణమే శాశ్వత బ్రిడ్జిని నిర్మించాలి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలి.
Also Read: Huzurabad: హుజురాబాద్ లేబర్ ఆఫీస్‌లో అవినీతి జలగలు.. పైసలు ఇస్తేనే ఫైల్ కదులుతుంది!
మరవీరుల త్యాగాలను స్మరించిన ఏసీపీ మాధవి.. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు
ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో పనిచేసే పోలీసుల త్యాగాలు వృథా కావని, వారి అమరత్వం అజరామరం అని హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి స్పష్టం చేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం హుజూరాబాద్ పట్టణంలోని క్లబ్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
24 గంటలు ప్రజల సేవలో నిమగ్నం
శిబిరాన్ని ప్రారంభించిన ఏసీపీ మాధవి, అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. “పోలీసులు నిత్యం ప్రజల సేవలో నిమగ్నమై ఉంటారు. 24 గంటలు పనిచేసేది కేవలం పోలీసులే”నని ఆమె అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పోషించే పాత్ర చాలా కీలకమని, వారి నిస్వార్థ సేవకు సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ వారోత్సవాలు అమరుల త్యాగాలను స్మరించుకోవడానికి, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి చక్కని అవకాశం అని అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలీసుల వీరత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె కొనియాడారు.
ప్రాణదాతలైన పోలీసులు, యువత
రక్తదానం ప్రాణదానంతో సమానం అని ఏసీపీ మాధవి పేర్కొన్నారు. రక్తం కొరతను తీర్చడానికి, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఆమె పిలుపు మేరకు
హుజూరాబాద్, జమ్మికుంట పోలీస్ సర్కిళ్ల పరిధిలోని పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పోలీసులతో పాటు స్థానిక యువత కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడంలో హుజూరాబాద్, జమ్మికుంట టౌన్ సీఐలు కరుణాకర్, రామకృష్ణ గౌడ్, రూరల్ సీఐలు పులి వెంకట్ గౌడ్, లక్ష్మీనారాయణ, ఎస్ఐ యూసుఫ్ తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చురుకుగా పాల్గొన్నారు.
Also Read: Huzurabad: 12 గంటలు దాటినా తెరవని హుజురాబాద్ ప్రభుత్వ కార్యాలయం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు
