Karimnagar ( iMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Karimnagar: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. 25 మందికి అస్వస్థత.

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్థులకు అందించిన భోజనం వికటించడంతో, దాదాపు 25 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Also Read: Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ

భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులు వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడటం ప్రారంభించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ, బాలికలందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు, అధికారులు వెల్లడించారు. అధికారుల విచారణ,

తల్లిదండ్రుల ఆందోళన

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో పాఠశాల మరియు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని భోజనం అందించడంపై, అధికారుల పర్యవేక్షణ లోపంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు మేల్కోవడం లేదని తల్లిదండ్రులు విమర్శించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న మండల విద్యాధికారులు (MEO), ఇతర ప్రభుత్వ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

మధ్యాహ్న భోజనం నాణ్యతపై లోతైన దర్యాప్తు

ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై వారు ప్రారంభ విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై లోతైన దర్యాప్తు చేపట్టి, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. వరుసగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, పర్యవేక్షణ లోపాలను మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: Karimnagar: నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపుల దందా.. ఫార్మసిస్ట్ లేకుండా జోరుగా మందుల విక్రయాలు!

Just In

01

Prasanth Varma: ‘జై హనుమాన్’ డౌటేనా? ప్రశాంత్ వర్మ ఇలా ఇరుక్కున్నాడేంటి?

Delhi Blast: ఢిల్లీ సమీపంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టివేత!

Delhi Explosion: దిల్లీ బ్లాస్ట్‌పై సీపీ స్పందనిదే.. దర్యాప్తుకు ఆదేశించిన హోం మినిస్టర్

Hyderabad Alert: ఢిల్లీ కారు బాంబు పేలుడు నేపథ్యంలో.. హైదరాబాద్ లో హై అలర్ట్

Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం