Thorrur SC Boys Hostel: తొర్రూరు పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం(Government SC Boys Hostel) దయనీయ స్థితిలో ఉంది. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ హాస్టల్ విద్యార్థులకు వసతి గృహం అన్న పేరు మాత్రమే మిగిలింది. వాస్తవానికి మాత్రం అక్కడ వసతుల్లేవు,విద్యార్థులు చదువుకోవడానికి, నివసించడానికి అనుకూలమైన వాతావరణం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు బయటికి చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. హాస్టల్ గదుల్లో బెడ్లు లేక ఇబ్బంది పడుతూ విద్యార్థులు నిద్రిస్తున్నారు. లైట్లు పనిచేయక రాత్రివేళ చీకటిలోనే పాఠాలు చదవాల్సి వస్తోంది.
టాయిలెట్‌ల మరింత దారుణం..
ఫ్యాన్లు పనిచేయక వేసవి రోజుల్లో ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని ఫ్యాన్లు పూర్తిగా పాడైపోయినా, మరికొన్ని పనిచేయక కేవలం ఊడిపోయిన రెక్కలతో వేలాడుతున్నాయి. గదుల తలుపులు పాడైపోవడంతో దోమలు, పాములు, ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని వారు చెబుతున్నారు. అంతేకాదు, హాస్టల్‌లోని బాత్రూమ్‌లు, టాయిలెట్‌ల పరిస్థితి మరింత దారుణంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. నీటి సరఫరా లేక స్నానం చేయడానికి, టాయిలెట్ ఉపయోగించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుభ్రత లేక దుర్వాసనతో వాతావరణం అసహనంగా మారిందని వారు వాపోతున్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు.. రూ.60,799 కోట్లతో తెలంగాణలో రోడ్ల శకం
హాస్టల్ పరిస్థితులపై ఆగ్రహం..
ఇలాంటి పరిస్థితులపై విద్యార్థులు పలుమార్లు హాస్టల్ వార్డెన్‌కి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. మేము హాస్టల్‌లో చదువుకోవడానికి వచ్చాం కానీ ఇక్కడ జీవించడమే కష్టంగా మారింది. సమస్యలు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు కూడా హాస్టల్ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు మంజూరవుతున్నయ లేదా..? అయితే వాటి వినియోగం ఎక్కడ జరుగుతోందో ప్రజలకు సందేహంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని హాస్టల్‌లో ప్రాథమిక వసతులను కల్పించాలని తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
Also Read: TET Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారంలో టెట్ నోటిఫికేషన్.!
