Election Betting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి మరికొన్నిగంటల్లో తెరపడతుంది. 11న ఎన్నిక జరగనున్నది. అయితే, ఈ పోటీలో గెలుపెవరిదో అంచనా వేస్తూ జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇది తెలంగాణ వరకే పరిమితం కాలేదు. పక్కనే ఉన్న ఆంధ్రాలోనూ జూబ్లీహిల్స్‌పై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్
నేటితో ప్రచారం పరిసమాప్తం కానున్నది. ఇన్ని రోజులు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. అయితే, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తున్నది. బెట్టింగులు కూడా ఈ రెండు పార్టీల మధ్యే అధికంగా జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని బెట్టింగ్ రాయుళ్లు అధికంగా కాంగ్రెస్ గెలుపుపైనే నమ్మకంగా ఉన్నారు. దీనికోసం సొంతంగా సర్వేలు కూడా చేయించుకుంటున్నట్టు సమాచారం. ఒక్క గెలుపు విషయంలోనే కాదు. మెజార్టీ ఎంత వస్తుంది? బీఆర్ఎస్‌కు దక్కే ఓట్లు ఎన్ని? కాంగ్రెస్ అభ్యర్థికి దక్కే ఓటు శాతం ఎంత? ఇలా రకరకాలుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. పోలింగ్ నాటికి ఈ ప్రక్రియ పీక్స్‌కు చేరనున్నది. ఇక, రిజల్ట్ వచ్చే 14వ తేదీన వందల కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉన్నది.
Also Read: The Great Pre-Wedding Show: ‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదేనట!
