Jio BSNL Partnership ( Image Source: Twitter)
బిజినెస్

Jio BSNL Partnership: గేమ్ మార్చబోతున్న అంబానీ.. జియో, బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఒప్పందం.. షాక్‌లో ఎయిర్‌టెల్, వొడాఫోన్

Jio BSNL Partnership: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio) ఎలా దూసుకుపోతుందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, జియో తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఆ ప్రభావం చూపనుంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)‌తో చేతులు కలిపింది. జియో బీఎస్‌ఎన్‌ఎల్ జట్టుగా నెట్‌వర్క్ విస్తరణకు సిద్ధంగా ఉంది. మార్కెట్‌లో కొత్త అలజడి మొదలైంది.

ముకేశ్ అంబానీ వ్యూహం ఫలిస్తుందా?

ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని జియో కంపెనీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రెండు కొత్త ఇన్‌ట్రా సర్కిల్ రోమింగ్ (ICR) రీచార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌ల ఉద్దేశ్యం – జియో నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్‌ ద్వారా మెరుగైన కనెక్టివిటీ అందించడం.

ఈ ఒప్పందంతో , జియో వినియోగదారులు గ్రామీణ లేదా దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవ్వగలరు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సేవలు కొంతమంది ప్రీపెయిడ్ రీచార్జ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో వినియోగదారులు వాయిస్ కాల్స్, డేటా, SMS సేవలను బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌పైనే ఉపయోగించగలరు.

Also Read: Komatireddy Venkat Reddy: జూబ్లీహిల్స్‌ గ్రౌండ్ వర్క్‌తో పోలింగ్‌పై మంత్రి దృష్టి.. క్షేత్ర స్థాయి లీడర్లతో వరుస సమీక్షలు

ముఖ్యమైన సమాచారం

1. కొత్త ICR రీచార్జ్ ప్లాన్‌లు రూ.196 , రూ.396 ధరల్లో అందుబాటులోకి వచ్చాయి.

2. రెండు ప్లాన్‌లకూ 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

3. రూ.196 ప్లాన్‌లో 2 GB డేటా, 1,000 నిమిషాల వాయిస్ కాల్స్, 1,000 SMSలు లభిస్తాయి.

4. రూ. 396 ప్లాన్‌లో 10 GB డేటా ఇవ్వబడుతుంది. కాల్స్, ఎస్ఎమ్ఎస్ ప్లాన్ లోవి వర్తిస్తాయి.

4. ఈ ప్లాన్‌లు కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ ICR నెట్‌వర్క్‌పైనే పనిచేస్తాయి.

Also Read: Komatireddy Venkat Reddy: జూబ్లీహిల్స్‌ గ్రౌండ్ వర్క్‌తో పోలింగ్‌పై మంత్రి దృష్టి.. క్షేత్ర స్థాయి లీడర్లతో వరుస సమీక్షలు

జియో తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కొత్త ప్రణాళిక టెలికాం మార్కెట్లో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో తన పరిధిని విస్తరించే ప్రయత్నంలో భాగం. ఈ భాగస్వామ్యం జియో కవరేజ్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ ద్వారా సేవలు అందించేందుకు తోడ్పడనుంది. ఇటీవల, నవంబర్ 2న టెలికాం శాఖ (DoT) రాజస్థాన్‌లోని ఉమెడ్ గ్రామంలోని 4G సైట్‌లో జియో–బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ షేరింగ్‌పై పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్ష విజయవంతమవడంతో, దేశవ్యాప్తంగా గ్రామీణ కనెక్టివిటీని పెంచే ఆలోచనలో ఉందని అధికారులు తెలిపారు.

Also Read: GHMC: హైదరాబాద్ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం.. జీహెచ్ఎంసీ డ్రెయిన్ల మ్యాపింగ్ ప్రక్రియ షురూ

ఎయిర్‌టెల్‌ కొత్త 4G టవర్స్

ఇదిలా ఉండగా, భారతి ఎయిర్‌టెల్ కూడా ప్రభుత్వ సహాయంతో డిజిటల్ ఇండియా ఫండ్ (Digital India Fund) కింద గ్రామీణ ప్రాంతాల్లో కొత్త 4G టవర్‌లను ఏర్పాటు చేసింది. ఈ టవర్‌లు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

Just In

01

Jubilee Hills Bypoll: నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు

Honda Elevate 2025: హోండా నుంచి కొత్త సర్ప్రైజ్.. ఎలివేట్ ADV ఎడిషన్ లాంచ్

Election Betting: జూబ్లీహిల్స్ బైపోల్‌పై వందల కోట్లలో పందాలు

Janasena X Account: జనసేన ట్విటర్ అకౌంట్ హ్యాక్!.. ఆదివారం ఉదయం ఏం పోస్టులు దర్శనమిచ్చాయంటే?

Singareni Collieries: భవిష్యత్తులో కీలక ఖనిజాల తవ్వకాలు ఉంటే భాగస్వాములవుతాం