Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: దారుణం.. ఆస్తి కోసం తల్లిని హతమార్చిన కొడుకు.. ఎక్కడంటే..?

Crime News: ఆస్తి పంపకాల విషయంలో మద్యం మత్తులో కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లిని రొకలిబండతో కొట్టి చంపిన హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా(Medak District) టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పుగొండ గ్రామానికి చెందిన సత్యమ్మ (60) అనే వృద్ధురాలికి సుదర్శన్ (44) అనే కొడుకు ఉన్నాడు.

తాగుడుకు బానిసై..

సుదర్శన్ గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. కొడుకు తాగుడుకు బానిస కావడంతో, అతని భార్య నాలుగేళ్ల క్రితమే పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుండి సుదర్శన్ ఆస్తి కోసం తల్లి సత్యమ్మను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా, తల్లి పేరుపై ఉన్న భూమిని తన పేరుపై మార్చాలని నిత్యం ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో, శుక్రవారం రాత్రి సుదర్శన్(Sudarshan) మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తల్లిని ఆస్తి తన పేరు మీద రాయాలని తీవ్రంగా కోరాడు. ఆమె అందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సుదర్శన్ ఇంటిలో ఉన్న రొకలిబండ తీసుకుని సత్యమ్మపై దారుణంగా దాడి చేశాడు.

Also Read: Mithramandali OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ‘మిత్రమండలి’.. కారణం అదేనా..

వేల్పుగొండ గ్రామంలో..

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యమ్మ(Satyamma) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో వేల్పుగొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లినే ఆస్తి కోసం హత్య చేసిన సుదర్శన్‌ను కసాయి కొడుకు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టేక్మాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Jubilee Hills byPoll: ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు.. సజ్జనార్​ ఉత్తర్వులు జారీ

Just In

01

Jayakrishna debut movie: హీరోగా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తున్న హిట్ సినిమాల దర్శకుడు..

Chikiri song: గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్..

Hyundai Venue 2025: హ్యుందాయ్ వెన్యూ 2025 ఎంట్రీతో SUV మార్కెట్లో రగడ.. టాటా, మారుతి, కియా, మహీంద్రాకి గట్టి పోటీ ఇస్తుందా?

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి

Sandeep Reddy Vanga: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినోకరు ఫాలో చేసుకుంటున్న సందీప్ రెడ్డి, రామ్ చరణ్.. ఇది దేనికి సంకేతం?