GHMC ( image credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: హైదరాబాద్ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం.. జీహెచ్ఎంసీ డ్రెయిన్ల మ్యాపింగ్ ప్రక్రియ షురూ

GHMC: హైదరాబాద్ మహానగరాన్ని ఇటీవల అతలాకుతలం చేసిన వర్షాల నేపథ్యంలో, జీహెచ్ఎంసీ (GHMC) గుణపాఠాలు నేర్చుకున్నది. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వరద ముంపును శాశ్వతంగా తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జీహెచ్ఎంసీ పరిధిలో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని వాటర్ డ్రెయిన్ల మ్యాపింగ్ ప్రక్రియను ముమ్మరం చేసింది. గ్రేటర్ పరిధిలో చిన్న, మధ్య, భారీ తరహా నాలాలు సుమారు 1013 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. అయితే, జీహెచ్ఎంసీ ఐటీ వింగ్ అధికారులు ఇప్పటివరకు దాదాపు 731 కిలోమీటర్ల పొడవున నాలాలను మ్యాపింగ్ చేశారు. ఈ కీలక సర్వే ప్రక్రియను వచ్చే నెలాఖరు కల్లా ముగించి, వెంటనే నాలాల మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: GHMC: బాగు చేస్తే మేలులెన్నో.. అమలుకు నోచుకోని స్టాండింగ్ కమిటీ తీర్మానం

ముంబై తరహా సిస్టమ్‌పై దృష్టి

పట్టణ ప్రాంత వరద నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తున్న బ్రిహన్ ముంబై, గుర్గావ్, భోపాల్ నగరాల తరహాలో హైదరాబాద్‌లోనూ అత్యాధునిక ఫ్లడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని కార్వాన్ ప్రాంతంలోని వాటర్ డ్రెయిన్లతో ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ పేరుతో మ్యాపింగ్ మొదలుపెట్టింది. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడానికి అనేక ప్రాంతాల్లో నాలాలు కబ్జాల కారణంగా బాగా కుదించుకుపోవడమే ప్రధాన కారణమని సర్వేలో తేలింది. అందుకే, గ్రౌండ్ లెవల్ సర్వేతో పాటు డ్రోన్ల ద్వారా కూడా సర్వే చేసి, నాలాలు గతంలో ఎంత విస్తీర్ణం, పొడవుతో ఉండేవి? ప్రస్తుతం ఎలా ఉన్నాయి? అనే వివరాలను పక్కాగా సేకరిస్తున్నారు.

సాంకేతిక సహకారం

వరదనీటి కాలువలు, చెరువులు, యూటిలిటీస్‌ను గుర్తించడానికి ఇస్రీ సంస్థ అందించిన ‘మొబైల్ ఫీల్డ్ వర్కర్ టైప్’ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రతి వార్డుకు ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. సర్వేలో భాగంగా గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ, వరద నీటిని మూసీలో కలిపే మార్గాలపై కూడా సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు. సర్వే పూర్తయ్యాక, ప్రతి స్ర్టామ్ వాటర్ డ్రెయిన్ మ్యాన్‌హోల్‌కు యూనిక్ నెంబర్ జారీ చేస్తారు. ఈ సమగ్ర సమాచారం ఆధారంగా అధికారులు పర్యవేక్షించడం సులభమవుతుంది. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి ముంబై తరహాలో అధునాతన ఫ్లడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ శరవేగంగా కృషి చేస్తోంది.

Also Read: GHMC: అటు రోడ్డు సేఫ్టీ ఇటు శానిటేషన్.. సత్ఫలితాలను ఇస్తున్న బల్దియా ప్లాన్..!

Just In

01

Pawan Kalyan: శేషాచలం అడవుల్లో పవన్.. కాలినడకన 4 కి.మీ ప్రయాణం.. కీలక ఆదేశాలు జారీ

Warangal District: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థిని..!

Ind vs Aus: భారత్-ఆసీస్ మధ్య 5వ టీ20 రద్దు.. సిరీస్ మనదే.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఎవరికంటే?

Cyber Crime: సైబర్ క్రైమ్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఈ ప్లాన్ తో ఎవరైనా పట్టుపడాల్సిందే..!

Snake In Scooty: అయ్యబాబోయ్.. స్కూటీలోకి దూరిన పాము.. జస్ట్ మిస్ లేదంటేనా..!