Shamshabad Airport: శంషాబాద్‌లో పలు విమానాలు రద్దు
Shamshabad Airport (Image Source: Twitter)
హైదరాబాద్

Shamshabad Airport: శంషాబాద్‌లో ఊహించని సమస్య.. పలు విమానాలు రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు

Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతార్జాతీయ విమానశ్రయంలో ఊహించని సమస్య తలెత్తింది. సాంకేతిక కారణాల రిత్యా పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని ఆలస్యంగా నడుపుతున్నారు. హైదరాబాద్ నుండి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో 6E051 విమానాన్ని రద్దు చేశారు. అలాగే హైదరాబాద్ – ముంబయి విమానం (6E245), హైదరాబాద్ – శివమెుగ్గ (6E51) వెళ్లాల్సిన విమానాలు సాంకేతిక కారణాలతో రద్దయ్యాయి.

ఆ విమానాలు ఆలస్యం..

అలాగే హైదరాబాద్ నుంచి కులాలంపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా 68 విమానం, హైదరాబాద్ – వియాత్నం ఫ్లైట్, హైదరాబాద్ – గోవా, హైదరాబాద్ – శివ మెుగ్గ (6E37) విమానాలు ఆలస్యంగా నడవనున్నాయి. అయితే కొన్ని విమానాలు రద్దు కావడం, పలు విమానాలు చెప్పిన సమయం కంటే టాకాఫ్ కు గంటల కొద్ది సమయం తీసుకుంటుండటంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆపై ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

రాత్రంతా పడిగాపులు

ముఖ్యంగా శంషాబాద్ టూ వియాత్నం ఫ్లైట్ కు సంబంధించిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో నిరసనకు దిగారు. రాత్రి 11.45 గం.లకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికీ కదలకపోవడంతో వారిలోని కోపం కట్టలు తెంచుకుంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్ పోర్టు సిబ్బంది చెప్పకపోవడంతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. రాత్రి నుంచి దాదాపు 200 మంది ప్రయాణికులం పడిగాపులు కాస్తున్నట్లు వాపోయారు. చాలా నిర్లక్ష్యంగా ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

దిల్లీలో 800 విమానాలు ఆలస్యం

అయితే శుక్రవారం దిల్లీలోని అంతర్జాతీయ విమానశ్రయంలోనూ ఇదే తరహా పరిస్థితులు తలెత్తాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకూ దాదాపు 800 పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఏటీసీ సమస్య గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ శుక్రవారం వచ్చేసరికి అది మరింత తీవ్రతరం అయ్యిందని దిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.

Also Read: The Girlfriend: ఆ రీల్ చూసి ఎమోషన్ అయిన రాహుల్ రవీంద్రన్.. ఈ సినిమా ఒక్కటి చాలు..

విమానాశ్రయం స్పందన

విమానాల ఆలస్యంపై ఎయిర్‌పోర్టును నిర్వహించే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) స్పందించింది. సాంకేతిక సమస్య ఏర్పడినట్టు నిర్ధారించింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి, తిరిగి సాధారణ స్థితిని సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించింది. కాగా, ఏటీసీ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని ఏఏఐ సీనియర్ తెలిపారు. సేవలను పునరుద్ధరించేందుకు పనులు కొనసాగుతున్నాయన్నారు.

Also Read: Jarran Telugu: హార‌ర్‌ థ్రిల్ల‌ర్ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్.. తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతున్న “జ‌ర‌ణ్”..

Just In

01

Shambala Movie Review: ఆది సాయికుమార్ ‘శంబాల’ ప్రపంచం ఎలా ఉందో తెలియాలంటే?.. ఫుల్ రివ్యూ..

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మార్కెట్‌లోకి వచ్చేశారు..

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!