rahul-ravindra( image :X)
ఎంటర్‌టైన్మెంట్

The Girlfriend: ఆ రీల్ చూసి ఎమోషన్ అయిన రాహుల్ రవీంద్రన్.. ఈ సినిమా ఒక్కటి చాలు..

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాతలు. ఈ ప్రెస్ మీట్ లో దర్శకుడు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా విషయంలో జరిగిన ఒక రియల్ ఘటనను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. అది ఏంటంటే..గుజరాత్ లో ఓ తెలుగు అమ్మాయి సినిమా చూడటానికి మార్నింగ్ షోకి వచ్చింది. అయితే ఆ సమయంలో ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో షో కేన్నిల్ చేద్దామనుకున్నారు థియేటర్ యాజమాన్యం. అయితే వారిని ఎలా గోలా ఒప్పించి సినిమా వేయించుకుంటుంది. ప్రారంభంలో ఒక్క అమ్మాయే ఉండటంతో చాలా భయమేసింది అని, సినిమా చూస్తున్న కొద్దీ దర్శకుడు తనతో ఉన్నట్లు అనిపించిందని ఆ తర్వాత ఒంటరిగానే పోరాడాలి, సింగిల్ గా ఎందుకు సినిమా చూడలేం అన్న ధైర్యాన్ని దర్శకుడు కల్పించారని ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియేలో పంచుకుందన్నారు. దీనిని చూసి ఏడుపొచ్చింది అని దర్శకుడు చెప్పుకొచ్చరు. ప్రస్తుతం ఈ వీడియే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read also-Mithramandali OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ‘మిత్రమండలి’.. కారణం అదేనా..

ఇది ముఖ్యంగా భూమా దేవి (రష్మిక మందన్న) అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఒక మధ్యతరగతి అమ్మాయి అయిన భూమా ఇంగ్లీష్ లిటరేచర్ పీజీ కోసం హైదరాబాద్ వస్తుంది. అక్కడ విక్రమ్ (దీక్షిత్ శెట్టి) తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడుతుంది. అయితే, వారి బంధం క్రమంగా టాక్సిక్ రిలేషన్‌షిప్‌గా మారుతుంది, దీని నుంచి భూమా ఎలా బయటపడింది, వ్యక్తిగత ఎదుగుదలను ఎలా సాధించింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. అయితే ఈ సినిమా మిశ్రమ టాక్ సొంతం చేసుకున్నా రెండోరోజు షోలలో పుంజుకుంటుంది. ఈ సినిమా విషయంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఈ సినిమా డబ్బులు కోసం తీయలేదని నిర్మాదలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Read also-The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిజల్ట్‌పై రష్మిక మందన్నా స్పందనిదే..

ఈ సినిమాకి ప్రధాన బలం రష్మిక మందన్న నటన. భూమా పాత్రలోని అమాయకత్వం, లోపలి సంఘర్షణ, బాధ, చివరికి తనను తాను నిలదొక్కుకునే పరివర్తనను ఆమె అద్భుతంగా పండించారని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ కథను అత్యంత భావోద్వేగంతో, ఆలోచింపజేసే విధంగా తెరకెక్కించారు. అయితే కథనం కాస్త నెమ్మదిగా సాగుతుందని, ముఖ్యంగా ద్వితీయార్థంలో వేగం తగ్గిందని కొన్ని అభిప్రాయాలు వచ్చాయి. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం కొన్ని కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాల్సిందని కొందరి అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఎపుడూ ఆదిరిస్తారు.  అయితే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.

Just In

01

MLC Phone Hacking: బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు ఫోన్ హ్యాక్ చేసిన దుండగులు.. పోలీసులకు ఫిర్యాదు!

Telugu movies records: తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏంటో తెలుసా.. పుష్ప అనుకుంటే పొరపాటే..

Congress Party: విశ్వనగర నిర్మాణంలో కాంగ్రెస్ పాత్రే కీలకం.. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాలకు టీపీసీసీ చెక్!

comedians turned heroes: టాలీవుడ్‌లోకి కమెడియన్లుగా వచ్చి హీరోలైన నటులు వీరే..

Jubliee Hills Bypoll: ప్రచారంలో సీతక్క దూకుడు.. బైక్ ఎక్కి గల్లీల్లో పర్యటన.. కేడర్‌లో ఫుల్ జోష్!